మనోజ్ భయ్యా ఈ గొడవలో అనవసరంగా దూరొద్దు: నాని ఇష్యూలో కౌశల్ ఆర్మీ!

నాగార్జున, నాని కాంబినేషన్లో తెరకెక్కిన 'దేవదాస్' చిత్రం ఈ రోజు గ్రాండ్‌గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ రియాక్ట్ అవుతూ... 'దేవ్ అండ్ దాస్ థ్రిల్లింగ్ కాంబో! ఈ ఇద్దరినీ ఒకే స్క్రీన్ మీద చూడటం ఆనందంగా ఉంది. రోజు రోజుకు యంగ్‌గా మారుతున్న నాగార్జున గారికి, నాని బాబాయ్‌కి, ఎంటైర్ దేవదాస్ టీమ్‌కు బెస్ట్ విషెస్ అంటూ' ఓ ట్వీట్ చేశారు.

అయితే మంచు మనోజ్ ఈ కామెంట్స్ చేయడం బిగ్ బాస్ కౌశల్ అభిమానులకు నచ్చలేదు. ఏం థ్రిల్లింగ్ భయ్యా... మీరు ఈ కామెంట్స్ చేసి మా కౌశల్ అభిమానులను హర్ట్ చేశారు అంటూ కొందరు వ్యాఖ్యానించారు. బిగ్‌బాస్ షో కారణంగా కౌశల్ అభిమానులకు నాని టార్గెట్ అయిన సంగతి తెలిసిందే.

పోల్: బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!

కౌశల్ అభిమానికి క్లాస్ పీకిన మనోజ్

కౌశల్ అభిమానులు చేసిన కామెంటుపై మనోజ్ రియాక్ట్ అవుతూ.... సినిమా ఒక్కరిది కాదు తమ్ముడు. ఎంతో మంది ఆకలి కష్టం. ఎన్నో డిపార్టుమెంట్లు రాత్రి పగలు ఫ్యామిలీస్‌ను వదిలి పని చేస్తారు. ఈ నెగెటివ్ థాట్స్ అన్నీ వదిలేయండి. అందమైన తెలుగు సినిమాను ఎంజాయ్ చేయండి. ప్రతి యాక్టర్, టెక్నీషియన్‌ను ప్రేమిద్దాం, గౌరవిద్దాం' అంటూ సమాధానం ఇచ్చారు.

నాని రెస్పెక్ట్ కోల్పోయారు

మనోజ్ గారు.. మాకు కూడా మనీ ఊరికే రావడం లేదండి, కష్టపడితేనే వస్తుంది మీ అందరి సినిమాలు చూడటానికి. ఒకరి కష్టం గురించి ఆలోచించే వ్యక్తి వేరే వాళ్లని చులకనగా మాట్లాడరు. నాని గౌరవం కోల్పోయాడు అంటూ కౌశల్ ఆర్మీకి చెందిన ఓ వ్యక్తి కౌంటర్ ఇచ్చారు.

మనోజ్ భయ్యా ఇందులో అనవసరంగా దూరొద్దు

మనోజ్ భయ్యా... ఈ విషయంలో అనవసరంగా దూరొద్దు. ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. తారక్ అన్న ఫ్రెండుగా మీపై రెస్పెక్ట్ ఉంది. బిగ్ బాస్‌లో నాని చేస్తుంది తప్పు. దానికి అతడు అనుభవించాలి. కౌశల్ ఆర్మీని లైట్ తీసుకుంటే అందరూ త్వరలోనే అనుభవిస్తారు... అంటూ ఓ వ్యక్తి ఘాటుగా వ్యాఖ్యానించారు.

Recommended Video

Manchu Manoj Responds On Fans Comments

మనోజ్ భయ్యా మీ ప్రవచనాలు ఆపండి

మంచు మనోజ్ చేసిన ఈ కామెంటుపై మరొక వ్యక్తి రియాక్ట్ అవుతూ.... ఏంది భయ్యా రోజూ నీ ప్రవచనాలు జనాలకు. మరీ హడావుడి చేస్తున్నావు. లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనకండి. ఎవడి పని వాడు చేస్తున్నాడు. నీ పని నువ్వు చేసుకోవచ్చుగా. ప్రతి రోజూ పెద్ద సత్యసాయిబాబా లాగా జనాలకు క్లాస్ పీకడం ఎందుకు? అంటూ కామెంట్ చేశాడు. దీనికి మనోజ్ నవ్వులూ చిందిస్తూ రిప్లై ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X