కౌశల్ ఫాలోయింగ్‌కు అంతా షాక్.... హీరోయిన్‌ను పట్టించుకోలేదు!
Recommended Video

బిగ్‌బాస్ 2 షో జరుగుతున్న సమయంలో సోషల్ మీడియాలో కౌశల్ అభిమానులు సందడి చూశాం. ఆ సమయంలో చాలా మంది ఇదంతా ఫేక్ కాంపెయిన్ అని అనుమానించారు. బాబు గోగినేని లాంటి వారి స్టేట్మెంట్స్ కూడా కౌశల్ ఆర్మీ పేయిడ్ ఆర్మీ అనే ప్రచారం జరుగడానికి కారణమైంది. అయితే బిగ్‌బాస్ 2 విజేతగా కౌశల్ నిలిచిన అనంతరం అనుమానాలన్నీ క్రమక్రమంగా తొలిగిపోతూ వచ్చాయి. బిగ్ బాస్ టైటిల్ గెలవడం వెనక కౌశల్‌కు 39.5 కోట్ల ఓట్లు రావడంతో.... చాలా మంది రియలైజ్ అయ్యారు. తాజాగా ఓ షాపింగ్ మాల్ ఓపెనింగులో కౌశల్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి తేలిపోయింది.
షాపింగ్ మాల్ ఓపెనింగులో కౌశల్
బిగ్‌బాస్ 2 విజేతగా నిలిచిన కౌశల్‌కు ఆపర్లు కూడా భారీగా వస్తున్నాయి. అటు సినిమా అవకాశాలతో పాటు అతడికి ఉన్న క్రేజ్ చూసి షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌కు కూడా పిలుస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని సుచిత్ర అనే ఏరియాలో కెఎల్ఎం షాపింగ్‌మాల్ ఓపెనింగుకు కౌశల్ హాజరయ్యారు.

ఫాలోయింగ్ చూసి అంతా షాక్
అయితే కౌశల్‌ను చూసేందుకు భారీగా జనరం తరలి రావడం చూసి అంతా షాకయ్యారు. సినిమా సూపర్ స్టార్స్ వచ్చినపుడు ఏం రేంజిలో జనం వస్తారో అంతకంటే ఎక్కువగా ఇసకేస్తే రాలనంత అభిమానులు తరలి రావడంతో చూసి అంతా ఆశ్యర్య పోతున్నారు.

అభిమానుల్లో ఉత్సాహం నింపిన కౌశల్
అక్కడికి భారీగా చేరుకున్న అభిమానులు కౌశల్ కౌశల్ అంటూ నినాదాలు చేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా కౌశల్ కార్ టాప్ మీదకు వచ్చి అభిమానులకు అభివాదం చేస్తూ వారిలో మరింత ఉత్సాహం నింపారు.

పాపం ఆమెను పట్టించుకోలేదు
ఇదే షాపింగ్ మాల్ ఓపెనింగుకు ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కూడా వచ్చింది. అయితే అభిమానులంతా కౌశల్‌ను చూస్తున్నారే తప్ప ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











