For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ కళ్యాణ్ ఏమైనా పోటుగాడా?.. వివరణ ఇచ్చిన బిగ్ బాస్ కౌశల్

  |
  Bigg Boss 2 Winner Koushal Press Meet | Filmibeat Telugu

  పవన్ కళ్యాణ్ ఏమైనా పోటుగాడా? అంటూ బిగ్ బాస్ విన్నర్ కౌశల్ మండ అన్నట్లు ఇటీవల ఓ టీవీ కార్యక్రమంలో కొందరు ఆరోపణలు చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కౌశల్‌ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై కౌశల్ గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు.

  బిగ్ బాస్‌లో నేను ఫాలో అయింది పవన్ కళ్యాణ్ గారి యాటిట్యూడ్. హౌస్‌లో నా ఎనర్జీ, యాటిట్యూడ్ అన్ని ఆయన వల్లే. ఎందుకంటే నేను ఆయన భక్తుడిని... అలాంటి నేను పవన్ కళ్యాణ్ గురించి ఆ మాట ఎందుకు అంటాను? అని కౌశల్ వ్యాఖ్యానించారు. తమ్ముడు, ఖుషి, బద్రి సమయంలో ఆయనతో చాలా క్లోజ్‌గా ట్రావెల్ అయ్యాను. ప్రతి రోజు మార్నింగ్ 5 గంటలకు ఆయనతో కలిసి జాగింగ్ వెళ్లేవాడిని అని కౌశల్ గుర్తు చేసుకున్నారు.

  కలవడానికి ప్రయత్నించాను

  కలవడానికి ప్రయత్నించాను

  బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి కలవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఆయన పీఏ హరి ప్రకాష్ గారికి ఎన్నోసార్లు ఫోన్ చేయడం జరిగింది. నా వద్ద ఆడియో క్లిప్స్ కూడా ఉన్నాయి. ఆఖరుకు పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ అసిస్టెంట్ అనీఫ్ భాయ్‌కు కూడా ఫోన్ చేశాను.

  ఆయనకు ఈ విషయం చెప్పుకోవాలనుకన్నాను

  ఆయనకు ఈ విషయం చెప్పుకోవాలనుకన్నాను

  పవన్ కళ్యాణ్ అంటే నాకు పిచ్చి. మీ వ్యక్తిత్వంతో, మీ బాడీ లాంగ్వేజ్‌తో, మీ పవర్‌తో, మీ ఎనర్జీతో బిగ్ బాస్ హౌస్‌లో మీకు బానిసై గెలిచాను అని చెప్పుకోవడం కోసం ఆయన్ను కలవాలనుకున్నాను. పవన్ కళ్యాణ్ ఏమైనా పోటుగాడా? అనే మాట నేనెందుకు అంటాను? నా గురించి ఎవరో ఏదో ఎలిగేషన్స్ చేస్తే పవన్ కళ్యాణ్ పేరు ఎందుకు తీస్తారు? నేను ప్రతి ఇంటర్వ్యూలో చెబుతూనే ఉంటాను పవన్ కళ్యాణ్ గారు నా ఇన్స్‌స్పిరేషన్ అని. అలాంటి వ్యక్తిపై నేనెందుు ఆరోపణలు చేస్తాను? అని కౌశల్ ప్రశ్నించారు.

  మహేష్ బాబు, పవన్ కళ్యాణ్

  మహేష్ బాబు, పవన్ కళ్యాణ్

  నేను గెలవడంలో మహేష్ బాబు ఫ్యాన్స్ సపోర్ట్ చేశారా? ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ చేశారా? అనేది ముఖ్యం కాదు. మహేష్ బాబు గారు మోడలింగ్ ఏజెన్సీ పెట్టించి నాకు లైఫ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు నాకు ఎన్నో మంచి విషయాలు చెప్పారు. వీరంటే నాకు ప్రత్యేక అభిమానం ఉంది. పవన్ కళ్యాణ్ గారిని నేను ఆ మాట అన్నట్లు ఎవరైతే శేషు అనే వ్యక్తి ఎలిగేషన్ చేశాడో... అతడు ఒక అమ్మాయితో పవన్ కళ్యాణ్ గురించి ఏం మాటలు మాట్లాడారో, పవన్ కళ్యాణ్ గారిని ఎవరు పోటుగాడు అన్నారో? చెప్పే కంప్లీట్ ఆడియో ప్రూప్ నా వద్ద ఉంది.

  డబ్బులు ఇచ్చి నా ఫోటో దహనం చేయించారు

  డబ్బులు ఇచ్చి నా ఫోటో దహనం చేయించారు

  పవన్ కళ్యాణ్ మీద నేను నోరు జారినట్లు సీన్ క్రియేట్ చేసి ఫేమస్ అయిపోదామనుకున్నారు. వాళ్ల ఫేసులు ఎవరికీ తెలియవు,.. పవన్ కళ్యాణ్ పేరు, కౌశల్ ఇష్యూ లాగితే ఫేమస్ అయిపోతామనే ఇదంతా చేశారు. ఎవరో కర్నూలులో డబ్బులు ఇచ్చి నా ఫోటోను దహనం చేయించారని కౌశల్ చెప్పుకొచ్చారు.

  కళ్యాణ్ సుంకర కూడా ఎంక్వయిరీ చేశారు

  కళ్యాణ్ సుంకర కూడా ఎంక్వయిరీ చేశారు

  జనసేన స్పోక్ పర్సనల్ కళ్యాణ్ సుంకర గారు నా గురించి మొత్తం ఎంక్వయిరీ చేసి స్పందించారు. ‘‘కౌశల్ మండ గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరూ ట్రోల్స్ చేయవద్దు. ఆయన పవన్ కళ్యాణ్ గురించి ఎక్కడ ఏ మాట జారలేదు. నేను పలు విభిన్నమైన మార్గాల్లో వాస్తవాలు వెలికితీసే ప్రయత్నం చేశాను. కౌశల్ పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి పట్ల గౌరవం కలిగి ఉన్నారని పెద్దల ద్వారా తెలిసింది. ఎలక్షన్ సమయంలో ఎలక్షన్ మీద మాత్రమే శ్రద్ధ పెట్టాలని కార్యకర్తలకు నా విన్నపం. కొందరు పని కట్టుకుని మనల్ని పక్కత్రోవ పట్టించడానికి ఇలాంటి గొడవల వైపు మనల్ని మళ్లిస్తున్నారు. గమనించ ప్రార్థన.'' అని ఓ పోస్టు కూడా పెట్టారని కౌశల్ తెలిపారు.

  పార్టీ పెడతానని అనలేదు, మాకు అంత దమ్ముందా?

  పార్టీ పెడతానని అనలేదు, మాకు అంత దమ్ముందా?

  నేను పార్టీ పెడతానని ఎప్పుడూ అనలేదు. కౌశల్ ఆర్మీతో మీట్ అయినపుడు అందులో ఒక వ్యక్తి అందరూ ఎలక్షన్ అని తిరుగుతున్నారు కదా, మీరు కూడా ఒక పార్టీ పెట్టండి సార్ అని అన్నారు. దానికి నేను రియాక్ట్ అవుతూ మనకు పార్టీ పెట్టే దమ్ముందా? అన్నానే తప్ప... నేను పార్టీ పెడతానని కానీ, నా భార్యను బాపట్ల నుంచి నిలబెడతానని ఎప్పుడూ అనలేదని కౌశల్ వివరణ ఇచ్చారు.

  నాపై కుట్ర జరుగడానికి కారణం అదే

  నాపై కుట్ర జరుగడానికి కారణం అదే

  ఈ కుట్ర నాపై జరుగడానికి కారణం... ఒక కామన్ మ్యాన్‌గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన వ్యక్తి కొన్ని వేల మంది అభిమానం సంపాదించుకోవడం కొందరికి నచ్చడం లేదు. అతడు నాశనం అయిపోవాలని ఇదంతా చేస్తున్నారు. కొందరు ‘మమ్మల్ని కౌశల్ ఆర్మీ నుంచి తీసేశాడని', కొందరు ‘కౌశల్‌తో సినిమా చేయడం లేదని చెబితే అందరూ ట్రోల్స్ చేస్తున్నారు' కసితో నన్ను నాశనం చేయడానికి ఇదంతా చేస్తున్నారు. నాపై అసత్య ఆరోపణలు చేసిన అందరిపై కేసు పెట్టినట్లు కౌశల్ తెలిపారు.

  English summary
  Bigg Boss 2 Winner Kaushal Manda says, "l am not used any Abusing word on Pawan Kalyan". Kaushal Prasad Manda is an Indian actor and model who predominantly works in Tollywood and TV Serials. He is the title winner of Bigg Boss Telugu 2, who won with highest number of votes in entire bigg boss 2 telugu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X