twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్

    |

    బిగ్ బాస్ రెండో సీజన్ విజేత కౌశల్ సోషల్ మీడియాలో ఎంతగా వివాదాలకు దారి తీశాడో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షోను, ఆడే ఆటను మొత్తం మార్చేశాడు. కౌశల్ ఆడిన ఆటకు ఎంతో మంది అభిమానులున్నారు. బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పుడూ ట్రోలింగ్ జరిగింది.. బయటకు వచ్చాక కూడా భారీగా విమర్శలు వచ్చాయి. కానీ కౌశల్‌కు బిగ్ బాస్ వల్ల ఒరిగిందేమీ లేదు. సినిమా అవకాశాలు కూడా అంతగా రాలేదు. కెరీర్ కూడా అంతగా ఊపందుకోలేదు.

    వివాదాలకు కేరాఫ్..

    వివాదాలకు కేరాఫ్..

    కౌశల్ మొదటి నుంచి కూడా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. కౌశల్ ఆర్మీ ఫౌండేషన్, దాని ఫండ్స్, డాక్టరేట్ విషయం, ప్రధాని ఆఫీస్ నుంచి ఫోన్ ఇలా ప్రతీ ఒక్క అంశంలో కౌశల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇలా అన్నింట్లోనూ కౌశల్ పరువుదీసుకున్నాడు.

    జోరందుకోని కెరీర్..

    జోరందుకోని కెరీర్..


    అయితే కౌశల్‌కు ఒకానొక సమయంలో విపరీతమైన ఆఫర్లు వచ్చాయని రూమర్లు జోరందుకున్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా కౌశల్ వెండితెరపై తన సత్తాను చాటుకోలేకపోయాడు. ఈ మధ్యే ఆది సాయి కుమార్ సినిమాలో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు.

    బిగ్ బాస్ కంటెస్టెంట్లు..

    బిగ్ బాస్ కంటెస్టెంట్లు..

    బిగ్ బాస్ కంటెస్టెంట్లు షో తరువాత బాగానే సెటిల్ అవుతుంటారు. కొందరు కొత్తింటిని కొనుక్కుంటారు.. కార్లు కొనుగోలు చేస్తుంటారు. లేదా ఏదైనా కొత్తగా వ్యాపారాలను చేసేందుకకు ఆ డబ్బులు వాడుకుంటుంటారు. మొత్తంగా బిగ్ బాస్ కంటెస్టెంట్లలో కొత్తింటిని కొనుగోలు చేసుకున్న వారు కూడా చాలా మందే ఉన్నారు.

    వారంతా అలా..

    వారంతా అలా..


    బిగ్ బాస్ మూడో సీజన్‌ కంటెస్టెంట్లలో శివజ్యోతి, అలీ రెజా వంటి వారు సొంతింటిని కొనుగోలు చేశారు. ఈ మధ్యే శివజ్యోతి కొత్త కారును కొనుక్కుంది. రాహుల్ సిప్లిగంజ్ బెంజ్ కారును కొనుక్కున్నాడు. తాజాగా కౌశల్ కూడా ఓ ఇంటివాడయ్యాడు.

    గృహ ప్రవేశ వేడుక..


    బిగ్ బాస్ రెండో సీజన్ విజేత కౌశల్ ఇన్నాళ్లకు ఓ ఇంటి వాడయ్యాడు. కొత్తింటిని కోనుగోలు చేసి గృహ ప్రవేశం జరిగిందిన చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కౌశల్ నూతన ఇంటి ప్రారంభోత్సవ వేడుకకు సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

    English summary
    Kaushal Manda House warming Ceremony,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X