twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాట నిలబెట్టుకున్న కౌశల్.. వీర జవానులు కోసం హీరో కార్తికేయ, హరీష్ శంకర్, ఆర్జీవీ విరాళం!

    |

    పుల్వామా ఉగ్ర దాడి ప్రతి భారతీయుడి కలచివేసే సంఘటన. దేశం కోసం ప్రాణాలని సైతం పణంగా పెట్టి బోర్డర్ లో శ్రమిస్తున్న సైనికులపై పాక్ ఉగ్రవాదులు పైశాచికత్వంతో రెచ్చిపోయారు. ఇండియా ఎంతగా శాంతి మంత్రం జపించినా పాకిస్తాన్ కుట్రలతో ఉగ్ర దాడులకు తెగబడుతూనే ఉంది. పుల్వామా ఘటనతో 49మంది వీర సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అమరులైన సైనికుల కుటుంబాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనితో ప్రముఖ సెలెబ్రిటీలంతా వీర సైనికుల కుటుంబాలని ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు.

     మాట నిలబెట్టుకున్న కౌశల్

    మాట నిలబెట్టుకున్న కౌశల్

    తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్ మరోమారు తన గొప్ప మనసుని చాటుకున్నాడు. పుల్వామా దాడిలో మరణించిన సైనిక కుటుంబాలని అందుకునేందుకు ముందుకు వచ్చాడు. ఇటీవల కౌశల్ పుల్వామా ఘటనని నిరసిస్తూ చేసిన క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నాడు. ఈ ర్యాలీలో తాను మరణించిన సైనికుల కుటుంబాలకు కొంత మొత్తాన్ని విరాళంగా ఇవ్వబోతున్నాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నేడు కౌశల్ ఐజి కార్యాలయంలో 50వేల రూపాయల విరాళాన్ని అందజేశాడు.

    కౌశల్‌పై ప్రశంసలు

    ఈ సందర్భంగా ఐజి మాట్లాడుతూ.. కౌశల్ యూత్ ఐకాన్ గా మారుతున్నారని ప్రశంసించారు. కౌశల్ ఆర్మీని ఎన్జీవో ఆర్గనైజేషన్ గా అభివృద్ధి చేసి ఇలాంటి సహాయ కార్యక్రమాలు కొనసాగించాలని ఐజి కౌశల్ ని కోరారు. భర్తతో పాటు కౌశల్ సతీమణి నీలిమ కూడా ఐజి కార్యాలయానికి వెళ్లారు. తన అభిమానులు ఎవరైనా సైనిక కుటుంబాలకు విరాళం అందించాలంటే కౌశల్ ఆర్మీ తరుపున ఇవ్వొచ్చని కౌశల్ తెలిపాడు. అభిమానులు అందించిన మొత్తాన్ని సైనిక కుటుటుంబాలకు చేరేలా చూస్తానని తెలిపాడు.

    మన హీరోలని తిరిగితీసుకురాలేం

    ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ మృతి చెందిన సైనిక కుటుంబాలకు 2 లక్షల ఆర్థిక సాయం అందించాడు. నేను చేసిన ఈ చిన్న సాయం వలన మన హీరోలని(మరణించిన సైనికులు) తిరిగి తీసుకురాలేం అని తెలుసు. కానీ ఇది మన భాద్యత. వాళ్ళందరిని మన సోదరులుగా భావించి ఆ కుటుంబాలకు అండగా నిలవాలని కార్తికేయ కోరాడు. కార్తికేయ 2 లక్షల రూపాయలని భారత్ కె వీర్ వెబ్ సైట్ ద్వారా అందించాడు.

    హరీష్ శంకర్, ఆర్జీవీ

    హరీష్ శంకర్, ఆర్జీవీ

    ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, రాంగోపాల్ వర్మ తమవంతుగా వీరజవానులు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. కానీ తాము ఎంత సాయం అందించాం అనే విషయాన్ని ప్రకటించుకోలేదు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి విజయ్ దేవరకొండ సైనికుల కుటుంబాలకు సాయం అందించాడు. బాలీవుడ్ నటులు అమితాబ్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ లాంటి హీరోలంతా భారీ ఎత్తున విరాళం ప్రకటించారు.

    English summary
    Tollywood celebrities Kaushal Manda, Kartikeya, Harish Shankar and RVG donates for martyred CRPF jawans' families
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X