For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Kaushal భార్య పరిస్థితి దారుణం: ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన నీలిమ.. సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు

  |

  కౌశల్ మండా.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు అప్పట్లో ఒక సంచలనం. దీనికి కారణం బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్‌బాస్'లో ఉన్నప్పుడు అతడు చేసిన హడావిడే. తద్వారా ఈయన దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఇక, ఎన్నో మలుపుల నడుమ ఆ సీజన్‌కు విన్నర్ అయిన కౌశల్.. ఆ తర్వాత ఎన్నో వివాదాల్లో చిక్కుకోవడంతో తరచూ వార్తల్లో నిలుస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే ఇటీవల తన భార్య నీలిమ ఆరోగ్యం గురించి ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా సోషల్ మీడియా ద్వారా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు మీకోసం!

  కౌశల్‌కు అండగా నిలిచిన నీలిమ

  కౌశల్‌కు అండగా నిలిచిన నీలిమ

  కెరీర్ ఆరంభంలోనే పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కౌశల్ మండా.. ఆ తర్వాత యాడ్ ఫిల్మ్ డైరెక్టర్‌గా మారాడు. అప్పటి నుంచి అతడి పరిస్థితి అమోఘంగా ఉంది. అయితే, అంతకంటే ముందే అతడు చాలా కష్టాలను అనుభవించాడు. ఆ సమయంలో కౌశల్‌కు భార్య నీలిమనే అండగా నిలిచారు. ఈ విషయాన్ని అతడే ఎన్నో ఇంటర్వ్యూల్లో స్వయంగా చెప్పిన విషయం తెలిసిందే.

  బిగ్ బాస్ విజయంలో కీలక పాత్ర

  బిగ్ బాస్ విజయంలో కీలక పాత్ర

  బిగ్ బాస్ రెండో సీజన్‌లో కౌశల్ కంటెస్టెంట్‌గా వెళ్లిన సమయంలో నీలిమనే బయట ఉండి చక్రం తిప్పారు. అతడికి ఓటింగ్ పడేటట్లు చూడడంతో పాటు ప్రచారం నిర్వహించడం వంటి వాటితో వంద రోజుల పాటు ఎంతగానో శ్రమించారు. తద్వారా భర్త గెలుపులో పరోక్షంగా భాగం అయ్యారు. బిగ్ బాస్ విజయంలో తన భార్య పడిన కష్టాన్ని కౌశల్ కూడా పదే పదే గుర్తు చేస్తూ వచ్చాడు.

  క్యాన్సర్ ఉందంటూ చెప్పిన కౌశల్

  క్యాన్సర్ ఉందంటూ చెప్పిన కౌశల్

  బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత కౌశల్ ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నాడు. మరీ ముఖ్యంగా కౌశల్ ఆర్మీ విషయంలో అతడు అవకతవకలు చేశాడంటూ ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో ఓ టీవీ ఛానెల్‌లో అతడి నిజస్వరూపం ఇదేనంటూ కొన్ని కథనాలు కూడా వచ్చాయి. అప్పుడు కౌశల్ తన భార్య నీలిమకు క్యాన్సర్ ఉందని.. దానికి ట్రీట్‌మెంట్ జరుగుతుందని చెప్పాడు.

  భార్య ఆరోగ్యం గురించి ఎమోషనల్

  భార్య ఆరోగ్యం గురించి ఎమోషనల్

  ఇటీవల కౌశల్ తన భార్య గురించి ‘ఏదో సాధించాలని వెళ్లిపోయావు.. ఏదో ఒకటి సాధించాలని నువ్వు నీ జీవితంతో పోరాడుతున్నావు.. నీకున్న ధైర్యంతో అది నువ్వు సాధిస్తావ్వు అని నాకు తెలుసు.. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా.. నీ కలల కోసం పోరాడిరా.. లవ్యూ.. మిస్ యూ' అంటూ అందులో పేర్కొన్నాడు. దీంతో ఆమెకు ఏదో అయిందని అంతా అనుకున్నారు.

  ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చేసిన నీలిమ

  ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చేసిన నీలిమ

  తన ఆరోగ్యం గురించి కొద్ది రోజులుగా వస్తున్న వార్తలు.. వాటి గురించి అభిమానులు ఆందోళన చెందుతుండడంపై తాజాగా నీలిమ స్పందించారు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానెల్‌లో ఓ సెల్ఫీ వీడియోను అప్‌లోడ్ చేశారు. తనకు ఏడు రోజుల క్రితం కరోనా వైరస్ సోకినట్లు ఆ వీడియోలో వెల్లడించారామె. ఇప్పుడు దానికి చికిత్స తీసుకుంటున్నట్లు కూడా చెప్పారు నీలిమ.

  వీడియోలో సంచలన విషయాలు

  ఈ వీడియోలో నీలిమ మాట్లాడుతూ.. ‘అందరికీ హాయ్.. నేను ఇప్పుడు యూకేలో ఉద్యోగం చేసేందుకు వచ్చాను. కరోనా సమయంలో ఇక్కడ చాలా సురక్షితంగా ఉండొచ్చని అనుకున్నా. కానీ నా కొలిగ్స్ వల్ల నాకు ఏడు రోజుల క్రితం కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్నా. అయితే, ఇక్కడ పరిస్థితులు ఏమంత బాగోలేదు. చాలా దారుణం' అని చెప్పారు.

  Bengaluru లో Pranitha Subhash Nitin Raju Marriage | గొప్ప మనసున్న నటి || Filmibeat Telugu
  పరిస్థితి దారుణంగా ఉందని చెప్పి

  పరిస్థితి దారుణంగా ఉందని చెప్పి

  దీనిని కొనసాగిస్తూ.. ‘నాకు ఊపిరి సంబంధిత సమస్యలు వచ్చాయి. అప్పుడు అక్కడి వాళ్లకు చెబితే పారాసిటమాల్ ట్యాబ్లెట్లు మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో చాలా భయపడిపోయాను. కానీ, దేవుడి దయ వల్ల నేను కోలుకున్నాను. ఇది ఇప్పుడు చెప్పడానికి కారణం.. ఇండియాలోనే కరోనాకు మంచి వైద్యం అందిస్తున్నారు. ఎవరూ దిగులు చెందొద్దు' అని వివరణ ఇచ్చారు నీలిమ.

  English summary
  Bigg Boss Telugu season 2 Winner Kaushal Manda Recently Post an Emotional Note about his Wife Neelima. Now She Revealed her Health Condition. బిగ్ బాస్ రెండో సీజన్ విన్నర్ కౌశల్ మండా ఇటీవల సోషల్ మీడియాలో తన భార్య నీలిమ గురించి ఎమోషనల్ నోట్ రాశాడు. ఇప్పుడు ఆమె తన ఆరోగ్య పరిస్థితి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X