బిగ్ బాస్ రీయూనియన్.. గీతా మాధురి, భానుశ్రీలతో కౌశల్ రచ్చ

బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు ఎన్ని గొడవలు జరిగినా, ఎన్ని మనస్పర్దలు వచ్చినా కూడా బయటకు వచ్చాక అందరూ కలిసిపోతారు. బిగ్ బాస్ ఇంట్లో ఎంత విరోధం ఉన్నా కూడా బయటకు వచ్చిన కొంత కాలానికి అన్ని మరిచిపోతుంటారు. అలా బిగ్ బాస్ రెండో సీజన్‌లో ఎన్నో గొడవలుపెట్టుకున్న వారంతా ఇప్పుడు ఒకే చోటకు వచ్చారు. రెండో సీజన్‌లో కౌశల్‌కు భాను శ్రీకి మధ్య ఎన్ని గొడవలు జరిగాయో అందరికీ తెలిసిందే.

 ప్రతీ రోజూ ఏదో ఒకటి..

ప్రతీ రోజూ ఏదో ఒకటి..

బిగ్ బాస్ షోలో ఇప్పటి వరకు జరిగిన నాలుగు సీజన్లలో రెండో మాత్రం వేరే లెవెల్‌లో ఉంటుంది. ప్రతీ రోజూ ఏదో ఒక గొడవ జరగాల్సిందే. అది కూడా కౌశల్‌ కేంద్రంగానే జరగాల్సిందే. అందులో ముఖ్యంగా భాను శ్రీ, రోల్ రైడా, సామ్రాట్ వంటి వారితోనే ఎక్కువగా గొడవలు అయ్యాయి.

గ్యాంగులతో వార్..

గ్యాంగులతో వార్..

రెండో సీజన్‌లో మొత్తం గ్యాంగ్స్ వార్ జరుగుతూ ఉండేవి. అందులో కౌశల్ మాత్రం ఎప్పుడూ సపరేట్‌గా ఉండేందుకు ట్రై చేసేవాడు. ఎవ్వరితోనూ అంతగా కలిసేవాడు కాదు. ఏదో మొక్కుబడిగా అందరితో మాట్లాడేవాడు. కానీ తనకంటే ఫ్రెండ్స్ అని చెప్పుకునేలా ఒక్కరూ కలవలేదు. కౌశల్ కలుపుకుపోలేదు.

భాను శ్రీ అలా..

భాను శ్రీ అలా..

యాపిల్ టాస్క్‌లో భాను శ్రీ చేసిన ఆరోపణలతో కౌశల్ ఇమేజ్ ఎక్కడికో పెరిగింది. కావాలనే టచ్ చేశాడంటూ ఉత్తిపుణ్యానికే కౌశల్‌పై భాను శ్రీ ఆరోపణలు చేసింది. అయినా కౌశల్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆ సమయంలో సరేైన స్టాండ్ తీసుకుని నిజాయితీగా జరిగింది చెప్పడంతో గీతా మాధురి కూడా మంచి పేరు సంపాదించుకుంది. కౌశల్ టచ్ చేయలేదని తన వాదనను గీతా మాధురి వినిపించింది. అలా కౌశల్ మీద ఆరోపణలు చేయడంతోనే ఆ వారం భాను శ్రీ ఎలిమినేట్ అయిపోయింది.

 తాజాగా ఇలా..

తాజాగా ఇలా..

అయితే బిగ్ బాస్ షో ముగిశాక కూడా కౌశల్ ఎవ్వరితోనూ అంతగా కలవలేదు. మొన్నామధ్య గీతా మాధురితో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ మధ్యే సామ్రాట్‌ను కలిశాడు.. సోదరుని లాంటివాడనిచెప్పుకొచ్చాడు.అయితే తాజాగా బిగ్ బాస్ రీ యూనియన్ అంటూ రోల్ రైడా, గీతా మాధురి, దీప్తి, భాను శ్రీ, సామ్రాట్‌లతో కలిసి దిగిన ఫోటోను కౌశల్ షేర్ చేశాడు. అయితే వీరంతా ఏదో షో కోసం ఇలా కలిశారని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X