ప్రజారాజ్యం పార్టి అధినేత చిరంజీవి అసెంబ్లీ టికెట్ కోసం తనను పది కోట్లు అడిగారని టీడీపి నాయకురాలు, సినీ నటి కవిత పేర్కొన్నారు. విజయనగరంలో ఆమె పార్టీ ప్రచారం చేస్తూ ప్రజారాజ్యం పార్టీ ప్రజా భోజ్యం పార్టీ అంటూ నిప్పులు చెరిగారు. కాగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొంత డబ్బులు వెనకేసుకుందువుగానిరా అంటూ పార్టీలోకి ఆహ్వానించారని, టీడీపి చంద్రబాబు మాత్రం ప్రజలకు సేవ చేయాలంటూ పార్టీ లోకి ఆహ్వానించారని ఆమె చెప్పుకొచ్చారు. అలాగే చిరంజీవికి పదవీదాహం ఎక్కువని, సామాజిక న్యాయం అంటే ఏమిటో తెలియదని ఆమె ఎద్దేవా చేసారు.