సినీనటి కుమార్తె అదృశ్యం.. కేసు నమోదు

By Srikanya

హైదరాబాద్ : సినీనటి కవిత కుమార్తె అదృశ్యమవడంతో పంజాగుట్ట పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసారు. పంజాగుట్ట ఎస్సై మాన్‌సింగ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అమీర్‌పేటలోని నీరజ్‌ పబ్లిక్‌స్కూల్‌ సమీపంలో కవిత కుటుంబం నివసిస్తోంది. ఆమె కుమార్తె బేకరీ వస్తువులు కొనుక్కువస్తానని బుధవారం మధ్యాహ్నం ఇంటినుంచి తన కారులో బయలుదేరింది. బుధవారం రాత్రి వరకు ఇంటికి చేరలేదు. దీంతో పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్‌కేసు నమోదు చేసారు.

కాగా ఆమె అంతకుముందు ఓ పాన్‌ బ్రోకర్స్‌ సంస్థలో తన వద్దనున్న గొలుసును, ఉంగరాన్ని తాకట్టుపెట్టి రూ.83వేలను తీసుకువెళ్ళింది. అనంతరం అమీర్‌పేటలోని తమకు పరిచయం ఉన్న ఓ సూపర్‌ మార్కెట్‌ నిర్వాహకులకు కారును, పాన్‌బ్రోకర్‌ చిట్టీలను అప్పగించి ఓ యువకుడితో కరీంనగర్‌ వెళ్లి అక్కడ అతడిని వివాహం చేసుకున్నట్లు తెలిసింది. ఈ సమాచారం తెలుసుకున్న పంజాగుట్ట పోలీసు బృందం కరీంనగర్‌ వెళ్లి ఆమెను, ఆ యువకుడిని నగరానికి తీసుకువస్తున్నట్లు సమాచారం.

మాధురి కరీంనగర్‌ జిల్లాలో ప్రేమ వివాహం చేసుకుంది. మాధురి తన కారు డ్రైవర్ రాజ్‌కుమార్‌ను ప్రేమవివాహం చేసుకోవటం అంతటా చర్చనీయాంసంగా మారింది. విషయం తెలుసుకున్న పెద్దపల్లి డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఎస్సై రాజేంద్రప్రసాద్ ఆలయానికి వె ళ్లి, కొత్త దంపతులను అదుపులోకి తీసుకున్నారు. మాధురిని హైదరాబాద్‌కు, రాజ్‌కుమార్‌ను పెద్దపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

మాధురి బంధువుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌ పంజాగుట్ట ఠాణాలో రాజ్‌కుమార్‌పై కేసు నమోదైంది. దీంతో పంజాగుట్ట పోలీసులు పెద్దపల్లికి వచ్చి అతడిని అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌ తరలించారు. ఈ సందర్భంగా మాధురి మీడియాతో మాట్లాడుతూ.. తమ పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించరనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చి, వివాహం చేసుకున్నామని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X