వివాదం : మత పెద్దలకు ఐటం లేడీ క్షమాపణ

ఈ చిత్రంలో ఐటం గర్ల్‌గా నటించిన కవితా వర్మ... శిలువతో కూడిన ఒక హారాన్ని మెడలో వేసుకుని సెక్సీ ఫోజులో సినిమాలో కనిపించింది. దీంతో క్రిష్టియన్ సెక్యూలర్ ఫోరం(సిఎస్ఎఫ్) తమ మనో భావాలు దెబ్బతీసేలా ఆ సీన్ ఉందని, ఎంతో పవిత్రమైన శిలువను సినిమాలో అభ్యంతర కరంగా వాడారని ఆగ్రహం వెల్లగక్కింది.
వెంటనే ఆ సీన్ తొలగించాలని, లేకుంటే విడుదల అడ్డుకుంటామని హెచ్చరించింది. దీంతో బెంబేలెత్తిపోయిన నిర్మాతలు టిపి అగర్వాల్, రాహుల్ అగర్వాల్.....సిఎస్ఎఫ్ జనరల్ సెక్రటరీ జోసెఫ్‌తో సమావేశం అయిన చర్చించారు. అనంతరం కవితా వర్మతో క్షమాపణ చెప్పించడంతో పాటు, ఆ సీన్ తొలగిస్తామని చెప్పడంతో వివాదం సద్దుమనిగింది.
కాగా...ఈ చిత్ర హీరో సంజయ్ దత్ 1993 ముంబై పేలుళ్ల కేసులో ఎరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న నేపథ్యంలో, ఈచిత్రం ప్రచార బాధ్యతలను సంజయ్ దత్ సోదరి ప్రియా దత్ నెత్తినేసుకున్నారు. తన సోదరుడు లేని లోటును తాను పూడ్చుతానని, నిర్మాతలకు సహకరిస్తానని ప్రియాదత్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











