twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెళ్ళయిన ఏడాదికే విడాకులంటూ కోర్టు కెక్కిన హీరోయిన్

    By Srikanya
    |

    మళయాళ నటి కావ్య మాధవన్ రెండు రోజులక్రితం తన భర్త నిశ్చల్ నుంచి విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టులో జాయింట్ పిటీషన్ ధాకలు చేసింది. క్రితం సంవత్సరం (2009) పిభ్రవరి లో వీరి వివాహం జరిగింది. నిశ్చల్..కువైట్ లో సాప్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. పెళ్ళయిన కొంత కాలానికే కావ్య కాపురం చెయ్యటం నా వల్ల కాదంటూ కేరళ తిరిగి వచ్చేసింది. అలాగే వచ్చిన వెంటనే తనను మానసికంగా వేధిస్తున్నారంటూ తన భర్త, అత్త మామలపై గృహ హింస చట్టం ప్రకారం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. ఆ తర్వాత వారు కలవలేదు. ఇప్పుడు విడాకులు కోరుతూ జాయింట్ గా పిటీషన్ వేస్తున్నారు. అయితే ఈ జంట కోర్టు బయిటే ఓ ఎగ్రిమెంట్ కి వచ్చి కేవలం చట్ట పరంగా విడిపోవటానికే కోర్టు గుమ్మం ఎక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇందునిమిత్తం ఇద్దరూ కోర్టుకు వేరు వేరు వాహనాల్లో వచ్చారు. జడ్జి ఎదురుగా తామిద్దరం పరస్పర అంగీకారంతోనే ఈ విడాకుల నిర్ణయానికి వచ్చినట్లు తెలియచేసారు. అలాగే ఈ విడాకలుకు వచ్చే ముందే తన భర్త, అత్త మామలపై పెట్టిన కేసుని విత్ డ్రా చేసుకుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X