కెబిసి షో: 7 కోట్లు గెలుచుకున్న క్యాన్సర్ బాధితురాలు
ముంబై: బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా కొనసాగుతున్న ‘కౌన్ బనేగా కరోడ్ పతి 8' కార్యక్రమంలో తాజాగా మరో సంచలనం చోటు చేసుకుంది. క్యాన్సర్‌తో బాధ పడుతున్న మేఘా పాటిల్ అనే మహిళ అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి రూ. 7 కోట్ల ఫ్రైజ్ మనీ గెలుచుకుంది.
‘కౌన్ బనేగా కరోడ్ పతి' చరిత్రలో ఒక మహిళ ఇంత పెద్ద మొత్తం గెలుచుకోవడం ఇదే తొలిసారి. మేగా పాటిల్ గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు. కొన్ని నెలల్లో ఆమె చనిపోబోతోంది. సాధారణ గృహిణి అయిన ఆమె...ఇంట్లో ట్యూషన్లు చెబుతుంటారు.

‘కౌన్ బనేగా కరోడ్ పతి' కార్యక్రమం అంటే మేఘ పాటిల్‌కు ఎంతో ఇష్టం. పట్టుదలతో ప్రయత్నించి కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. అక్కడ ఫాస్టెస్ట్ ఫంగర్ రౌండ్ దాటి హాట్ సీటు వరకు వచ్చి...అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి పూర్తి ఫ్రైజ్ మనీ రూ. 7 కోట్లు దక్కించుకుంది.
క్యాన్సర్ కారణంగా చావుకు దగ్గరైనా.....ఏ మాత్రం ఆత్మ విశ్వాసం కోల్పోకుండా ఆమె ఈ విజయం సాధించడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.


Click it and Unblock the Notifications











