దొబ్బేయ్, నువ్వు నీ అవకాశవాద కంపు.. వర్మపై విమర్శలు, కేసీఆర్‌ను ‘ఆడు’అనడంపై వివరణ!

Recommended Video

Ram Gopal Varma Announces KCR Biopic Titled Tiger || Filmibeat Telugu

'టైగర్ కేసీఆర్' అనే టైటిల్‌తో రామ్ గోపాల్ వర్మ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మీద బయోపిక్ తీయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ తెలంగాణ కోసం టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధించడం వరకు జరిగిన పరిణామాలు ఇందులో చూపించబోతున్నారు.

'ది అగ్రెసివ్ గాంధీ' అనే క్యాప్షన్‌తో టైటిల్ లోగో విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మ... దాని 'ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు' అనే కొటేషన్ పెట్టారు. అయితే కేసీఆర్‌ను 'ఆడు' అని సంబోధించడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వర్మ వివరణ ఇచ్చారు.

అందుకే ‘ఆడు' అనే పదం.. కేసీఆర్, కేటీఆర్ అర్థం చేసుకుంటారు

‘‘ఆడు అనే పదం మీద అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వారికి నేను చెప్పేది ఒకటే... తెలంగాణ సాధించక ముందు కేసీఆర్‌ను చిన్నచూపు చూసిన కొందరు అలాంటి పదం వాడారు, ఆ లైన్లో ఎంత డెప్త్ ఉందో కేసీఆర్, కేటీఆర్ అర్థం చేసుకుంటారు'' అని వర్మ ట్వీట్ చేశారు.

దొబ్బేయ్ నువ్వు నీ అవకాశవాద కంపు

దొబ్బేయ్ నువ్వు నీ అవకాశవాద కంపు

రామ్ గోపాల్ వర్మ తీయబోతున్న ఈ బయోపిక్ మీద తీవ్రంగా ట్రోలింగ్ జరుగుతోంది. ‘దొబ్బేయ్ నువ్వు నీ అవకాశవాద కంపు' అంటూ కొందరు వర్మపై మండి పడ్డారు. కేసీఆర్ మీద వర్మ పొగడ్తలు గుప్పించడంపై చాలా మంది నెటిజన్లు ఆగ్రహంగా ఉన్నారు.

అది ఎచీవ్మెంట్ కాదు, చేతకాని తనం

అది ఎచీవ్మెంట్ కాదు, చేతకాని తనం

కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించడం ఎచీవ్మెంట్ అని వర్మ పేర్కొనడంపై నెటిజన్లు తమదైన శైలిలో ఫైర్ అయ్యారు. ''అది అచీవ్మెంట్ కాదు.. ఒక రాజకీయ పార్టీ చేతకానితనం మరియు ముఖ్యంగా ఎందరో విద్యార్ధుల ఆత్మత్యాగం.'' అని పేర్కొంటున్నారు.

ఆడు అనేది కేసీఆర్ ఒంటిపదం

ఆడు అనేది కేసీఆర్ ఒంటిపదం

‘‘తెలంగాణ వచ్చిందంటే ఉద్యమంలో కేసీఆర్ ఒక భాగం... కేసీఆర్‌యే తెలంగాణ కాదు.. అందులో హరీష్రావ్, విద్యార్థులు,ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగుల కృషి ఎంతో ఉంది. ఆడు అనే పదం తెలంగాణలో అగౌరవ పదమని అనేవారు అది కేసీఆర్ ఒంటిపదం అని మరిచిపోకండి.'' అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మాస్ పీపుల్ మాత్రమే అర్థం చేసుకుంటారు

మాస్ పీపుల్ మాత్రమే అర్థం చేసుకుంటారు

‘ఆడు' అనేది అగౌరవ పదం కాదు. ఆ పదంలో మాస్ పీపుల్ మాత్రమే అర్థం చేసుకుంటారు. హై రెస్పెక్ట్ ఇచ్చే విషయంలో దాన్ని వాడతారు. ఉదాహరణకు ‘ఆడు గొప్పోడురా' అని మరికొందరు సూచిస్తున్నారు.

‘ఆడు' పదం తెలంగాణ కల్చర్లో భాగం

‘ఆడు' పదం తెలంగాణ కల్చర్లో భాగం

‘ఆడు' అనే పదంతో ఎలాంటి ఇబ్బంది లేదు. అది తెలంగాణ కల్చర్లో ఒక భాగం... అంటూ మరికొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అది మా దోస్తుల పదం

అది మా దోస్తుల పదం

మా దోస్తుల పదం 'గా అవులే గాడు'...ప్రేమగా ఆత్మీయతతో కూడిన స్నేహమైన పదం! దానిలో డెప్త్ ఎవరూ కొలవలేరు!... అంటూ మరికొందరు కామెంట్ చేశారు.

యువతను తప్పుతోవ పట్టించే సినిమా

యువతను తప్పుతోవ పట్టించే సినిమా

‘ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు' అనే పదం కంటే ‘యువతను తప్పుతోవ పట్టించే సినిమా' అనే క్యాప్షన్ బాగా సూటవుతుంది అంటూ కొందరు ఈ సినిమాపై తమ అయిష్టాన్ని వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X