twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కోడి రామకృష్ణ మరణంపై కేసీఆర్, చంద్రబాబు సంతాపం

    |

    ప్రముఖ దర్శకుడు శ్రీ కోడి రామకృష్ణ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు సినీరంగంలో తనదైన శైలితో ఎన్నోచిత్రాలను తెరకెక్కించి, 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని కోడి రామకృష్ణ మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు.

    KCR and CBN Offers Deep Condolences On Kodi Ramakrishnas Demise

    ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిసతూ 'ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మృతి తీవ్ర విచారకరం. ఎన్నో విజయవంతమైన గ్రామీణ ప్రాంత నేపధ్యంతో కూడిన కుటుంబ కథా చిత్రాలకు దర్శకత్వం వహించారు, తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర కథానాయకులందరితో సినిమాలు రూపొందించిన ఘనత సాధించిన ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు.' అన్నారు.

    ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ రియాక్ట్ అవుతూ.. 'సీనియ‌ర్ డైరెక్ట‌ర్ కోడి రామ‌కృష్ణ‌గారు అనారోగ్యంతో క‌న్నుమూయ‌డం ఎంతో బాధాక‌రం. శ‌తాధిక ద‌ర్శ‌కుడిగా ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు చిత్ర సీమ‌కు అందించారాయ‌న‌. ఎమోష‌న‌ల్ చిత్రాల‌ను అద్భుతంగా తెర‌కెక్కించే ద‌ర్శ‌కుల్లో కోడి రామ‌కృష్ణ‌గారు ముందు వ‌రుస‌లో ఉంటారు. అలాగే ఆయ‌న వైవిధ్య‌మైన చిత్రాల‌ను కూడా అందించారు. ట్రెండ్‌కు త‌గిన‌ట్లు గ్రాపిక్స్ చిత్రాల‌ను కూడా అద్భుతంగా తెర‌కెక్కించారు.

    ఆయ‌న‌తో క‌లిసి మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు, ముద్దుల క్రిష్ణ‌య్య‌, ముద్దుల మావ‌య్య, ముద్దుల మేన‌ల్లుడు, భార‌తంలో బాల‌చంద్రుడు, మువ్వ గోపాలుడు, బాల‌గోపాలుడు చిత్రాల‌కు ప‌నిచేశాను. ఇలాంటి గొప్ప ద‌ర్శ‌కుడిని కోల్పోవ‌డం సినీ ప‌రిశ్రమ‌కు తీర‌నిలోటు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని, ఆ భ‌గ‌వంతుడు వారి కుటుంబ స‌భ్యుల‌కు మ‌నోధైర్యాన్ని ప్ర‌సాదించాల‌ని ప్రార్థిస్తున్నాను.' అన్నారు.

    English summary
    Telangana CM K ChandraSekhar Rao and Andhra Pradesh Chief Minister Chandrababu Naidu expressed their deep grief over the demise of the prominent director Kodi Ramakrishna.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X