కొన్ని చిత్రాలను నిర్మిస్తాము : తెలంగాణా జాగృతి కవిత
హైదరాబాద్ : ''తెలంగాణా జాగృతి తరఫున త్వరలోనే కొన్ని చిత్రాలను నిర్మిస్తాము''ని తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. ఆమె చేతుల మీదుగా 'పంచాయతీ' అనే చిత్రం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ'పంచాయతీ'లో ఆకాష్ హీరోగా నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతా ఇలా స్పందించారు. అలాగే తెలంగాణా ప్రాంతం నుంచి మరింత మంది నటీనటులు చిత్రసీమకు రావల్సిన అవసరం ఉందన్నారు.
సమాజంలో జరుగుతున్న వివిధ సంఘటనలపై జరిగే పంచాయతీ ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'పంచాయతీ'. ఆకాష్, సుహాసిని, సోనీచరిష్టా కాంబినేషన్‌లో ఎస్వీ క్రియేషన్స్ పతాకంపై లంకెల అశోక్‌రెడ్డి, దశరథ సంగిశెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ''అన్యాయానికి గురైన బాధితులు కొంతమంది పెద్దల సమక్షంలో చేసే న్యాయపోరాటమే మా చిత్రంలో కీలకాంశం'' అన్నారు దర్శకుడు.
విశ్వప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ఆరంభమైంది. తొలి దృశ్యానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కెమెరా స్విచాన్ చేశారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.పి.ఎస్. వాసు, సమర్పణ: రాంబాబు నాయక్. సుహాసిని, సోని చరిష్ట నాయికలు. విశ్వప్రసాద్ దర్శకుడు. లెంకల అశోక్‌రెడ్డి నిర్మాత.సుమన్, నాజర్, పొన్నాంబళం, ఫణిరాజ్ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: యస్.పి.యస్.వాసు.


Click it and Unblock the Notifications












