twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దర్శకుడి కోసం తెలంగాణ ప్ర‌భుత్వం జీవో.. కేసీఆర్‌ని కలిసిన ఎన్. శంకర్

    |

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు దర్శకనిర్మాతలు ప్రభుత్వ సహాయ సహాకారాలు అందుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తెలంగాణ సెపరేట్ అయ్యాక కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సినీ పరిశ్రమ పట్ల సానుకూలం గానే ఉన్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని పలువురు సినీ ప్రముఖులు సైతం స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం ఉన్న తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలంగాణ సినిమాకు పెద్ద పీట వేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా ఓ నిర్ణయం తీసుకొని జీవో జారీ చేశారు. వివరాల్లోకి పోతే..

    తెలంగాణ వచ్చాక ఇండస్ట్రీ పెద్దలతో చర్చలు

    తెలంగాణ వచ్చాక ఇండస్ట్రీ పెద్దలతో చర్చలు

    తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్ కి ఆయువు పట్టు లాంటింది. గతంలో చెన్నై నుంచి హైదరాబాద్ తరలి వచ్చిన సినీ పరిశ్రమ అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు ఎంతోమంది కళాకారులకు ఉపాధి కల్పిస్తోంది. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ పరిశ్రమకు ప్రొత్సాహాలు అందించడంలో ముందుంటున్నారు. ఈ మేరకు పలుమార్లు సినీ పెద్దలతో చర్చలు జరిపి సినీ ఇండస్ట్రీ మంచి చెడ్డ తెలుసుకున్నారు కేసీఆర్.

    తెలంగాణ సినిమాకు కూడా పెద్ద పీట వేసేలా..

    తెలంగాణ సినిమాకు కూడా పెద్ద పీట వేసేలా..


    ప్రాంత భేదం లేకుండా ఇండస్ట్రీ మొత్తాన్ని అక్కున చేర్చుకుంటున్న కేసీఆర్ తెలంగాణ సినిమా ఆదరణను పెంచేలా కృషి చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ ఉద్య‌మంలో సినిమా ఇండ‌స్ట్రీ త‌ర‌ఫు నుంచి తనవంతుగా భాగస్వామ్యం అందించిన డైరెక్టర్ ఎన్. శంకర్‌కి స్టూడియో నిర్మాణం కోసం 5 ఎక‌రాల స్థ‌లం ఇస్తూ జీవో జారీ చేశారు. తెలంగాణ సినిమాకు కూడా పెద్ద పీట వేసేలా కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

    జీవో ప్ర‌కారం స్టూడియో విశేషాలు

    జీవో ప్ర‌కారం స్టూడియో విశేషాలు

    తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఎన్. శంకర్‌కి కేటాయించిన స్టూడియో స్థలం వివరాలు జీవో ప్రకారం చూస్తే.. ఈ 5 ఎకరాల స్థలం శంక‌ర‌ప‌ల్లిలోని మోకిల్ల‌లో ఉంది. ఇందులో సర్వాంగ సుందరంగా స్టూడియో నిర్మాణం చేపట్టి తెలంగాణ సినిమాను అభివృద్ధి చేయాలనేది కేసీఆర్ ఆలోచన అని తెలుస్తోంది. మరోవైపు కేటీఆర్ కూడా సినీ ఇండస్ట్రీ పట్ల సానుకూలంగా ఉండటం దర్శకనిర్మాతలకు మంచి ప్రొత్సాహం ఇస్తోంది.

    కేసీఆర్‌కి ధన్యవాదాలు

    కేసీఆర్‌కి ధన్యవాదాలు

    స్టూడియో నిర్మాణం కోసం తనకు స్థలం కేటాయించినందుకు గాను డైరెక్టర్ ఎన్. శంకర్, ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు శాలువా కప్పి ఆయనను సత్కరిస్తూ తెలంగాణ సినిమా కోసం మీరు చేస్తున్న కృషికి కృతజ్ఞతలు అని చెప్పారు. సినీ పరిశ్రమకు మున్ముందు ఇలాంటి మరిన్ని ప్రొత్సాహకాలు అందించాలని కోరారు శంకర్.

    డైరెక్టర్ ఎన్. శంకర్‌, కేసీఆర్ సాన్నిహిత్యం

    డైరెక్టర్ ఎన్. శంకర్‌, కేసీఆర్ సాన్నిహిత్యం

    తెలంగాణ ఉద్య‌మం సమయం నుంచే కేసీఆర్, డైరెక్టర్ ఎన్. శంకర్‌ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఉద్య‌మం జ‌రుగుతున్న స‌మ‌యంలో కూడా జై బోలో తెలంగాణ లాంటి ఉద్య‌మ చిత్రాన్ని అందించి ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో తనవంతు సహకారం అందించారు ఎన్. శంకర్.

    Read more about: film studio
    English summary
    Telangana CM K. Chandrashekar Rao gives palce to establish a film studio. Director N. Shankar going to start a new studio in Shankarpalli
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X