twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా హాళ్ల మూసివేత.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

    |

    ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకొన్నది. తెలంగాణ పరిస్థితి చేజారిపోతున్న సమయంలో ప్రభుత్వం సినిమా హాళ్లను, విద్యాసంస్థలను నిరవధికంగా వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

    కరోనావైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని షాపింగ్ మాల్స్, థియేటర్లు, విద్యాసంస్థలను మార్చి 31వ వరకు మూసి వేయాలని నిర్ణయం తీసుకొన్నాం అని తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.

     KCR Government to close malls and Cinema Halls due to Coronavirus

    కొవిడ్-19 విస్తరిస్తున్న నేపథ్యంలో థియేటర్ల మూసివేతకు ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయానికి పూర్తి మద్దతు తెలుపుతామని తెలుగు సినీ నిర్మాతలు, ఎగ్జిబ్యూటర్లు, డిస్టిబ్యూటర్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో పలు సినిమాలను వాయిదా వేస్తూ నిర్మాతలు నిర్ణయం తీసుకొన్నారు.

    కరోనావైరస్ ధాటికి నాని నటించిన వీ చిత్రం, రాజ్ తరుణ్ నటించిన ఒరేయ్ బుజ్జిగాడు, ప్రదీప్ మాచిరాజు నటించిన 30 రోజుల్లోప్రేమించేద్దాం ఇలా అనే సినిమాలు వాయిదా పడ్డాయి. ఈ సినిమాలు మార్చి 25 తేదీన రిలీజ్ కావాల్సి ఉండగా.. ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేసినట్టు సమాచారం.

    English summary
    KCR's TS Government to close malls and Cinema Halls due to Coronavirus. In this situaton, V, Ore Bujjiga movie releases postponed.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X