twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలనాటి హీరో సతీమణికి కేసీఆర్‌ సాయం

    By Srikanya
    |

    హైదరాబాద్‌: దివంగత నటుడు టీఎల్‌ కాంతారావు సతీమణి హైమావతి(80)కి ప్రతీ నెలా రూ. పదివేల ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. నల్గొండ జిల్లాకు చెందిన కాంతారావు అయిదు దశాబ్దాల పాటు చిత్రాల్లో నటించారు. తర్వాత అనారోగ్యంతో మరణించారు. కాంతారావు మరణానంతరం ఆయన కుటుంబం దీనస్థితిలో ఉన్న విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. జనవరి నుంచి ఈ సాయం అందుతుంది.

    జానపద హీరోగా ఒక వెలుగు వెలిగి తరువాత జీవితంలో చితికిపోయిన అలనాటి హీరో దివంగత కాంతారావు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది. కాంతారావు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. ఆయన మరణం తరువాత కుటుంబం పరిస్థితి మరింత దిగజారింది. కాంతారావు భార్య హైమవతికి నెలకు పదివేల రూపాయలు చెల్లించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

    KCR govt grants pension to late Kantha Rao’s wife

    కాంతారావు 1923లో నల్లగొండ జిల్లాలోని కోదాడ లో కేశవరావు, సీతారమణమ్మ దంపతులకు జన్మించారు. 1960 కాలంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన కాంతారావు 400 చిత్రాలకు పైగా నటించారు. ఐడు సినిమాలను నిర్మించి నిర్మాణ రంగంలో కూడా తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. అలనాటి అగ్రకథానాయకులైన ఎన్‌టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావులతో తనదైన శైలిలో మెప్పించి తెలుగు ప్రజల మన్ననలను పొందారు.

    తెలుగు సినిమా రంగములో అనేక సాంఘిక, జానపద మరియు పౌరాణిక పాత్రలు ధరించిన కాంతారావు నిర్దోషి చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. ఈయన సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2000లో రఘుపతి వెంకయ్య అవార్డు ప్రదానం చేసి సత్కరించింది. రామారావు, నాగేశ్వరరావు లకు సమకాలికులుగా కొన్ని సందర్బాలలో వారితో సమానమైన గుర్తింపు పొందారు.

    ఎన్‌టిఆర్, ఏఎన్నార్‌ల తరువాత అంత గొప్ప ఖ్యాతిని పొందిన వ్యక్తి కాంతారావు. ఆయన కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై వుంది. ఎన్ని రకాల పాత్రలు చేసినా నారద పాత్ర నీ కోసమే అని ఎన్‌టీఆర్ అన్నారంటే కాంతారావు గొప్పదనం ఏంటో తెలుస్తోంది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగివుండే వ్యక్తిత్వం ఆయనది.

    English summary
    Telangana government on Wednesday sanctioned monthly financial assistance of Rs 10,000 to Hymavathi, 80, wife of late Telangana actor T L Kantha Rao, during her life time from January 2015.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X