సినిమా వాళ్లు కేసీఆర్‌కు భయపడటం లేదు, ఆయన డిక్టేటర్ కాదు: మంచు విష్ణు
Recommended Video
హైదరాబాద్‌లో ఉండే ఏపీ రాజకీయ నాయకులతో పాటు సినిమా వాళ్లు కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ అంటే భయపడుతున్నారని, అందుకే వారికి వ్యతిరేకంగా మాట్లాడటానికి ఎవరూ సాహసించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు పొలిటీషియన్స్ ఈ విషయంపై బహిరంగ వ్యాఖ్యలు సైతం చేశారు.
ఇటీవల తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడైన తర్వాత 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం, మూల్యాంకనంలో నిర్లక్ష్యం జరిగినట్లు తేలడంతో పలువురు సినీ స్టార్లు స్పందించారు కానీ... సీఎం కేసీఆర్ మీద, తెలంగాణ ప్రభుత్వం మీద ఎలాంటి విమర్శలు చేయలేదు. సినిమా వాళ్లకు కేసీఆర్ అంటే భయం... అందుకే ఎవరూ విమర్శించడం లేదనే వాదనపై మంచి విష్ణు రియాక్ట్ అయ్యారు.

గవర్నమెంట్ స్పందించక పోతే విమర్శించాలి
20 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం విషాదకరం. ఒక తప్పు జరుగడం వల్ల ఇలా జరిగిందనే విషయం తెలిసి బాధ పడ్డాను. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం. ఇక్కడ ప్రభుత్వం స్పందించకపోతే విమర్శించాల్సిందే. కానీ అలాంటి పరిస్థితులు నాకైతే కనిపించలేదు.

కేసీఆర్ డిక్టేటర్ కాదు
మనం ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నాం. నాకు చాలా కాలంగా కేటీఆర్ తెలుసు. ఆయన ప్రో యాక్టివ్, ప్రో స్టూడెంట్ పొలిటీషియన్. కేసీఆర్ ఫ్రైర్ బ్రాండ్ అనే విషయం నేను కాదనడం లేదు. కానీ అందుకు కారణం ఉంది. కానీ ఆయన డిక్టేటర్(నియంత) అయితే కాదు. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం కంటే... అసలు తప్పు ఎక్కడ జరిగిందనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను.

కేసీఆర్‌కు సినిమా వాళ్లు భయపడటం లేదు
‘‘సినిమా వాళ్లు కేసీఆర్ అంటే భయపడుతున్నారు అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ అందులో ఏ మాత్రం నిజం లేదు. ఇలాంటి ఆరోపణలు కొందరు కావాలని చేస్తున్నారు. ఇంటర్మీడియట్ ఫలితాల విషయంలో తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలి, భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అదే ఇప్పుడు ముఖ్యం.'' అని మంచు విష్ణు తెలిపారు.

మంచు విష్ణు
మంచు విష్ణు సినిమాల విషయానికొస్తే... ఆయన హీరోగా నటించిన పొలిటికల్ డ్రామా 'ఓటర్' చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఎన్నికల తర్వాత ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. రమా రీల్స్ బ్యానర్‌పై జి.ఎస్.కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జాన్‌సుధీర్ పూదోట నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











