‘వెన్నుపోటు’ కాదు... ఆయనదంతా ‘ముందు పోటు’: సింహం, కుక్క అంటూ వర్మ ట్వీట్
వివాదాలకు కేంద్రబిందువుగా ఉండే రామ్ గోపాల్ వర్మ తన తాజా చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కు ప్రచారం కల్పించడానికి ఏ విషయాన్నీ వదలడం లేదు. ఇప్పటికే 'వెన్నుపోటు' సాంగుతో సంచలనం క్రియేట్ చేసిన ఆయన తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరును విమర్శిస్తూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో షేర్ చేసిన వర్మ.... ఆయన అంటే తనకు చాలా ఇష్టమని చెప్పడం గమనార్హం. వర్మ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వెన్నుపోటు కాదు... ఆయనదంతా ముందు పోటే
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచే అలవాటు లేదు ... ఆయనదంతా ముందు పోటు. అందుకే నాకు చాలా ఇష్టం అంటూ వర్మ ట్వీట్ చేశారు.
సింహం, కుక్క ఉదాహరణలతో
అంతటితో ఆగని రామ్ గోపాల్ వర్మ... సింహం, కుక్క ఉదాహరణతో మరో ట్వీట్ చేశారు. దీనికి నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు వర్మ తీరును తప్పు బడుతుండగా, మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' ఎన్టీ రామారావు జీవితంలోని పలు వివాదాస్పద అంశాల ఆధారంగా రూపొందుతోంది. రామారావు జీవితంలోకి లక్ష్మీపార్వతి వచ్చిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఈ చిత్రంలో చూపించబోతున్నారు.

పోటా పోటీ రిలీజ్
ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్ సంక్రాంతికి విడుదలవుతుండగా.... ఈ చిత్రంతో పోటీ పడుతూ రామ్ గోపాల్ వర్మ తన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











