అల్లు అర్జున్, స్నేహారెడ్డి పెళ్లికి కెసిఆర్ హాజరు?
సినీ నటుడు అల్లు అర్జున్, స్నేహారెడ్డిలది కులాంతర వివాహం మాత్రమే కాదు, సీమాంధ్ర - తెలంగాణ వారి మధ్య పెళ్లి కూడా. సీమాంధ్రకు చెందిన అల్లు అర్జున్ కు, తెలంగాణకు చెందిన స్నేహారెడ్డికి వివాహం ఉత్సుకతనే కలిగిస్తుంది. ఇప్పటికే అల్లు అర్జున్ మ్యారేజ్ పై జోరుగా చర్చ జరుగుతోంది. వారి ప్రేమ గురించి ఆ చర్చ కాదు. వారి పెళ్లికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు హాజరు కానున్నారట. అల్లు అర్జున్ కాబోయే మామ కె. శేఖర రెడ్డి కేసీఆర్‌కు చాలా అత్యంత సన్నిహితుడట. ఇప్పటికే శేఖర్ రెడ్డి తెరాసకు చెందిన పలువురు నాయకులకు పెళ్లికి ఆహ్వానం పలికినట్లు తెలుస్తోంది. ఇది ముందస్తు పిలుపు మాత్రమే. కెసిఆర్ కు కూడా నోటి మాటగా శేఖర రెడ్డి ఆహ్వానం పలికినట్లు ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకాలం చిరంజీవి కుటుంబ సభ్యుల సినిమాలకు తెలంగాణలో ఎదురవుతున్న ఇబ్బందులు ఇక ఉండబోవని భావిస్తారేమో.


Click it and Unblock the Notifications











