KCRకు షాక్ ఇచ్చిన ఎలక్షన్ కమిషన్... కన్నీళ్లు పెట్టుకున్న జబర్దస్త్ కమెడియన్

జబర్దస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లలో రాకింగ్ రాకేష్ ఒకరనే విషయం తెలిసిందే. జబర్దస్త్ షోలో చిన్న కంటెస్టెంట్ గా ఎంటర్ అయి.. తనదైన పంచులు, ప్రాసలతో బుల్లితెర ప్రేక్షకులను నవ్విస్తూ.. టీమ్ లీడర్ గా ఎదిగారు. అయితే ఆయన ఇటీవల హీరోగా మారిన సంగతి తెలిసిందే. రాకింగ్ రాకేష్ హీరోగా కేసీఆర్ అనే సినిమా రాబోతుంది. ఈ సినిమాకు ఆయనే నిర్మాత. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. దీనితో ఈ కమెడియన్ లైవ్ లోనే కన్నీళ్లు పెట్టుకుంటూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చెప్పుకువచ్చారు. ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

జబర్దస్ షో ఇప్పటికే ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అందులో ఓ చిన్న కమెడియన్ గా ఎంటర్ అయి.. టీమ్ లీడర్ అయిపోయిన రాకింగ్ రాకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తన పంచులు, ప్రాసలతో సిల్వర్ స్క్రీన్ ఆడియెన్స్ ను అలరిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే జబర్దస్త్ కమెడియన్స్ డైరెక్టర్లుగా మారిన సంగతి తెలిసిందే.

KCR Movie Produced by Jabardasth Comedian Rocking Rakesh was shocked by the Election Commission

జబర్దస్త్ కమెడియన్ శాంతి కుమార్, వేణు ఇప్పటికే డైరెక్టర్లుగా మారి సినిమాలు తెరకెక్కించారు. సుడిగాలి సుధీర్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన హీరోగా మారి సినిమాలు చేసుకుంటున్నాడు. ఇక ఇప్పుడు కమెడియన్ రాకింగ్ రాకేష్ హీరోగా మారబోతున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా కేసీఆర్ అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా తెలంగాణ ముఖ్యమంత్రి బయెపిక్ గా తెరకెక్కుతుందని తెలుస్తోంది.

ఈ సినిమాకు రాకింగ్ రాకేష్ కేవలం హీరోనే కాదు.. నిర్మాత కూడా. తన ఇంటిని తాకట్టు పెట్టి మరీ ఈ సినిమాను తెరకెక్కించారట. ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. షూటింగ్ కూడా పూర్తి చేసుకుందని.. త్వరలో ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు ఊహించని షాక్ తగిలింది. కేసీఆర్ సినిమాకు ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది. ఈ సినిమా రిలీజ్ ను ఆపాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

KCR Movie Produced by Jabardasth Comedian Rocking Rakesh was shocked by the Election Commission

ఇక దీనిపై రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. అందులో ఆయన కన్నీళ్లు పెట్టుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సినిమాని నవంబర్ 17న కానీ 24న కానీ విడుదల చేయాల్సి ఉందని చెప్పుకువచ్చారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకుందని.. త్వరలోనే ప్రమోషన్స్ ప్రారంభించాలనుకున్నట్లు వెల్లడించారు. అయితే ఇంతలో ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చిందని ఆవేదన చెందారు.

కేసీఆర్ సినిమా రిలీజ్ వాయిదా పడటంలో ఎవరి ప్రమేయం లేదు. చట్ట ప్రకారం ఎన్నికల ముందు ఇలాంటి సినిమాలు రిలీజ్ చేయొద్దని ఎన్నికల కమిషన్ చెప్పుకువచ్చిందని వీడియోలో రాకింగ్ రాకేష్ వెల్లడించారు. ఇది కూడా తన మంచికే అనుకుంటున్నట్లు తెలిపారు. ఇకపై తన సినిమాని మరింతగా ప్రమోట్ చేసుకునే సమయం దొరికిందని చెప్పుకువచ్చారు. తెలంగాణ ఎన్నికల తర్వాత KCR సినిమాను రిలీజ్ చేస్తామని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X