twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గాయకుడు రామకృష్ణ మృతికి సీఎం కేసీఆర్‌ సంతాపం

    By Srikanya
    |

    హైదరాబాద్‌: అలనాటి ప్రముఖ గాయకుడు వి.రామకృష్ణ మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. రామకృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు

    ఆనాటి ప్రముఖ గాయకుడు విస్సంరాజు రామకృష్ణ కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ రోజు జూబ్లీహిల్స్‌ వెంకటగిరిలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    రామకృష్ణ....విస్సంరాజు రంగశాయి, రత్నం దంపతులకు 1947 ఆగస్టు 20 రామకృష్ణ విజయనగరంలో జన్మించారు. గానకోకిల సుశీల రామకృష్ణకు పినతల్లి. నేదునూరి కృష్ణమూర్తి దగ్గర శాస్త్రీయ సంగీతంలో మెళకువలు నేర్చుకున్నారు.

    KCR pays tribute to RamaKrishna

    ఆయన కెరీర్ విషయానికి వస్తే...

    ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌, శోభన్‌బాబు, కృష్ణంరాజు నటించిన చిత్రాల్లో గాత్రమందించారు. ముఖ్యంగా....భక్తి గీతాల ఆలాపనలో తనదైన ముద్ర వేసుకున్నారు. మహాకవి క్షేత్రయ్య, దానవీరశూరకర్ణ, అమరదీపం, శ్రీమద్‌విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, శ్రీషిర్డీసాయిబాబా మహత్యం, బలిపీఠం, గుణవంతుడు, అందాలరాముడు, తాతా మనవడు, భక్తతుకారం, శారద, భక్తకన్నప్ప, కృష్ణవేణి, అల్లూరి సీతారామరాజు, కరుణామయుడు వంటి ఎన్నో చిత్రాల్లో ఆయన పాటలు పాడారు. తన సుమధుర గాత్రంతో ప్రేక్షకుల మదిలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారు.

    అమరగాయకుడు ఘంటసాల స్ఫూర్తితో సినీ రంగ ప్రవేశం చేసిన రామకృష్ణ 200 చిత్రాల్లో దాదాపు 5వేలకు పైగా గీతాలను ఆలపించారు. ఆయన ఆలపించిన భక్తి గీతాల ఆల్బమ్స్‌ విశేష ఆదరణ పొందాయి.

    రామకృష్ణ తనయుడు తనయుడు సాయి కిరణ్‌ ఉషాకిరణ్‌మూవీస్‌ 'నువ్వే కావాలి' చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. రామృకృష్ణ మృతిపట్ల సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిదని పలువురు సినీ ప్రముఖులు కొనియాడారు. వన్ ఇండియా తెలుగు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తోంది.

    English summary
    Telangana CM KCR pays tribute to RamaKrishna. Legendary playback singer RAMAKRISHNA has left this world earlier today [16th July 2015]. Vissamraju Ramkrishna has sung over 5000 songs and is renowned for his association with actors like ANR and Sobhan Babu
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X