రిలీజ్ రోజే ఆ సినిమా చూస్తా : కేసీఆర్

థర్మల్ పవర్ ప్లాంట్ల వల్ల మానవహక్కులకు, పర్యావరణానికి ఎలా నష్టం కలుగుతుందో అద్భుతంగా చూపించారని తెలిపారు. సినిమాలో శ్రీకాకుళం జిల్లా సోంపేట ఉద్యమకారులే హీరోలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విలన్లు అని అన్నారు. సామాజిక అంశాలను మానవీయ కోణంలో చూసే కళాకారుడు నారాయణమూర్తి అని కేసీఆర్ కొనియాడారు. సెప్టెంబర్ 14న 'పీపుల్స్ వార్' సినిమా విడుదల అవుతుందని చెప్పారు.
ఈ సినిమా గురించినారాయణ మూర్తి మాట్లాడుతూ...'' శ్రీకాకుళం జిల్లా సోంపేట, కాకరాపల్లి తదితర గ్రామాల ప్రజలు థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఆ నేపథ్యాన్ని ఎంచుకొని రాసుకొన్న కథే ఇది. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన గున్నా జోగారావు పాత్రలో శ్రీహరి నటిస్తున్నారు. పర్యావరణాన్ని బూడిద కుప్పలుగా మార్చేసే ప్రాజెక్టులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలే ఈ చిత్రంలో ప్రతినాయకులు అన్నారు.
నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో శ్రీహరి, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











