twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రిలీజ్ రోజే ఆ సినిమా చూస్తా : కేసీఆర్

    By Bojja Kumar
    |

    K Chandrasekhar Rao
    హైదరాబాద్ : దర్శకుడు, నిర్మాత ఆర్. నారాయణమూర్తి తీసిన 'పీపుల్స్ వార్' సినిమా అద్భుతంగా ఉందని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. రిలీజ్ రోజే ఆ సినిమా చూస్తానని వెల్లడించారు. 'పీపుల్స్ వార్' ప్రివ్యూ చూసిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ... థర్మల్ పవర్ ప్లాంట్ల వల్ల జరిగే నష్టాన్ని ఈ సినిమాలో నారాయణమూర్తి కళ్లకు కట్టినట్లు చూపించారని పేర్కొన్నారు.

    థర్మల్ పవర్ ప్లాంట్ల వల్ల మానవహక్కులకు, పర్యావరణానికి ఎలా నష్టం కలుగుతుందో అద్భుతంగా చూపించారని తెలిపారు. సినిమాలో శ్రీకాకుళం జిల్లా సోంపేట ఉద్యమకారులే హీరోలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విలన్లు అని అన్నారు. సామాజిక అంశాలను మానవీయ కోణంలో చూసే కళాకారుడు నారాయణమూర్తి అని కేసీఆర్ కొనియాడారు. సెప్టెంబర్ 14న 'పీపుల్స్ వార్' సినిమా విడుదల అవుతుందని చెప్పారు.

    ఈ సినిమా గురించినారాయణ మూర్తి మాట్లాడుతూ...'' శ్రీకాకుళం జిల్లా సోంపేట, కాకరాపల్లి తదితర గ్రామాల ప్రజలు థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఆ నేపథ్యాన్ని ఎంచుకొని రాసుకొన్న కథే ఇది. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన గున్నా జోగారావు పాత్రలో శ్రీహరి నటిస్తున్నారు. పర్యావరణాన్ని బూడిద కుప్పలుగా మార్చేసే ప్రాజెక్టులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలే ఈ చిత్రంలో ప్రతినాయకులు అన్నారు.

    నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో శ్రీహరి, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రలు పోషించారు.

    English summary
    KCR praises Narayana Murthy's movie Peoples War. Peoples War is a Telugu film to be released on 2012 Directed by R.Narayana Murthy. The Censor Board has cleared the movie ‘People’s War’ directed and produced by R.Narayana Murthy with U/A certification. The film is starred by R.Narayana Murthy himself, Srihari, Posani Krishna Murali. The music is scored by R.Narayana Murthy. The Lyrics were written by Goreti Venkanna, Suddhala Ashok Teja, K. Venkanna, Baruva Kalidas, Allam veeranna, Jayaraj, and Dharmavaram Venkataramana. The highlight of the movie is revolutionary songs and power full dialogues by the R. Narayana Murthy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X