'జైబోలో తెలంగాణ' చిత్రం చూసి సీమాంధ్రుల్లో మార్పు!?
ఎన్.శంకర్ రూపొందించిన 'జై బోలో తెలంగాణ' సినిమా చూశాక సీమాంధ్రులు కూడా జై తెలంగాణ, జై ఆంధ్రాగా విడిపోవాలని కోరుకుంటారని భావిస్తున్నట్లు టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. ఆయన ఈ చిత్రం చూసి మీడియాతో మాట్లాడుతూ...తొలి నుంచి సీమాంధ్రులు తెలంగాణను వ్యతిరేకించటంలేదని, హైదరాబాద్‌కు వ్యాపారం కోసం వచ్చి న పిడికెడు మంది మాత్రమే తెలంగాణను అడ్డుకుంటున్నారని అన్నారు. అలాగే ఈ చిత్రాన్ని ప్రతి తెలంగాణ బిడ్డ చూడాలన్నారు.
ఇక గుంటూరు నుంచి అడ్వకేట్స్ నాకు ఫోన్ చేశారు. 'జైబోలో తెలంగాణ' సీమాంధ్రకు వ్యతిరేకంగా ఉంటుందేమోనని అనుకున్నామని, సినిమా చూశాక తెలంగాణకు సపోర్ట్ చేయాలని అనిపించిందని వారు చెప్పారు. విశాఖపట్నంలోనూ ఈ సినిమా చూశాక అక్కడి ప్రజలు 'జై తెలంగాణ' అని నినాదాలిచ్చారు. తెలంగాణ ప్రజల బతుకుపోరాటాన్ని చాలా చక్కగా చూపించిన ఈ సినిమాను చూడాలి..చూపించాలి అని ఆయన కోరారు.
అలాగే మూడు తరాల తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని చాలా అద్భుతంగా.. నభూతోనభవిష్యత్‌గా సినిమాను చిత్రీకరించారు. శతాబ్ది కాలంగా తెలంగాణ సమాజం అనుభవిస్తున్న బాధలు, దుఃఖాన్ని, ఉద్యమాన్ని దశ్య కావ్యంగా మలిచిన తీరు అద్భుతం. దర్శకుడు ప్రెజంట్ చేసిన తీరును చూసి తీరాలి. ఇది మామూలు డైరెక్టర్లకు సాధ్యంకాదు. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల తరఫున చిత్ర దర్శక, నిర్మాత ఎన్.శంకర్‌కు ధన్యవాదాలు చెబుతున్నానంటూ ఆయన అభినందించారు.


Click it and Unblock the Notifications











