తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు గురువారం సాయంత్రం చిరంజీవి ఇంటికి వెళ్లారు. చిరంజీవి తండ్రి వెంకట్రావు మరణించిన రోజు ఫోన్ లో చిరంజీవితో మాట్లాడిన కేసీఆర్ గురువారం సాయంత్రం చిరంజీవి ఇంటికి వెళ్లి తన సంతాపాన్ని తెలిపారు. దాదాపు 40 నిమిషాలపాటు చిరంజీవి ఇంట్లో కేసీఆర్ గడిపారు. గుజరాత్ ఎన్నికలు సహా పలు రాజకీయ అంశాలపై చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది. కేసీఆర్ తో పాటు ఆ పార్టీ నాయకులు వి ప్రకాష్, సుదర్శన్ తదితరులు ఉన్నారు. కేసీఆర్ చిరంజీవి ఇంటికి వచ్చినపుడు ఇంట్లో చిరంజీవితో పాటు ఆయన సోదరుడు నాగేంద్రబాబు, బావమరిది అల్లు అరవింద్, ప్రముక నిర్మాత సి అశ్వనీదత్ లు ఉన్నారు.