twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ అలా ఎందుకు పిలుస్తాడో అర్దమైంది

    By Srikanya
    |

    సినిమాలో కొన్ని యాక్షన్ సీన్స్‌ని రాజమౌళి తీస్తాడన్నప్పుడు... ఎంత వరకు ఆ సీక్వెన్స్‌కి ప్రాణం పోయగలుగుతాడు అనిపించింది. ఆ సీన్స్‌ని తీసి ల్యాప్‌టాప్‌లో చూపించినప్పుడు, ఎన్టీఆర్ జక్కన్న అని రాజమౌళిని ఎందుకు పిలుస్తాడనేది అప్పుడు అర్థమైంది. నాకైతే ఆ సీన్స్‌ని చూడగానే రాజమౌళిని అమరశిల్పి జక్కన్న అనాలనిపించింది అంటూ ప్రసంశించారు కీరవాణి. ఆయన తాజా సంగీతం అందించిన తాజా చిత్రం 'రాజన్న'ప్రమేషన్ లో భాగంగా కలిసిన మీడియాతో ఇలా స్పందించారు. అలాగే ..ఏడేళ్ళ కిత్రం చిన్నాన్న ఈ సినిమా కథను వినిపించారు. 'రాజన్న' సినిమా ఆయన కల. ఆ కలను నాగార్జున నిజం చేశారు. మేమంతా రంగులద్ది ఆ రంగులకలను నెరవేర్చాం. 'గిజిగాడు' అనే పాటను మా నాన్న రాశారు. ఆ పాట ఈ చిత్రానికి కిక్ స్టార్ట్‌లాంటింది. అలాగే సుద్దాల అశోక్‌తేజ రాసిన 'వెయ్ వెయ్' అనే పాట ఎంతగానో ఆకట్టుకుంది అన్నారు.

    నాగార్జున మాట్లాడుతూ " కమర్షియల్ చిత్రంలో ఉండే డ్యూయెట్లు, ఫైట్లు 'రాజన్న' సినిమాలో లేవు. అయినా ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. నిర్మాతగా, నటుడిగా ఎంతో సంతృప్తినిచ్చిన చిత్రమిది. . చిత్ర దర్శకుడు విజయేంద్రప్రసాద్‌ని ఎంత అభినందించినా తక్కువే. ఓ ప్రణాళిక ప్రకారం కథ, మాటలు, పాటలు ఈ చిత్రానికి రెడీ చేశారు. డెబ్బై ఏళ్ళ వయసులో కూడా ఆయనకున్న చురుకుదనం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. 'రాజన్న'లాంటి సినిమా చేయాలంటే చాలా కష్టం. అలాంటి కష్టమైన కథను ఎంతోబాగా తెరకెక్కించారు. రాజమౌళి మార్కు ఈ సినిమాలో కనిపిస్తోంది అంటున్నారు. అలాంటిదేమీ లేదు. ఆయన కొన్ని యాక్షన్ సీక్వెన్స్ మాత్రమే తీశారు. కీరవాణి అందించిన బాణీలు అద్భుతంగా ఉన్నాయి. గతంలో 'అన్నమయ్య' చిత్రానికి బాణీలు అందించారు. దానికి కృతజ్ఞతలు చెబుదామనుకునే సరికి 'రామదాసు' నాకు ఇచ్చారు. దానికి కృతజ్ఞతలు చెబుదామంటే ఈలోపు 'రాజన్న' చిత్రాన్ని ఇచ్చారు. ఏవిధంగా రుణం తీర్చుకోవాలో అర్థం కావడం లేదు అన్నారు.

    English summary
    Keeravani wondered if Annie was born just for the sake of essaying the role. "Her acting in sentimental scenes was very realistic. Gijigadu number is my personal favourite. I also like Suddala Ashok Teja's Veyi Veyi song," MM averred.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X