RRR: రసూల్ పై కీరవాణి బూతు ట్వీట్.. వెంటనే డిలీట్ చేసినా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ.. ఏమైందంటే?

ఆర్ఆర్ఆర్ మూవీ మీద ఆస్కార్ అవార్డు గ్రహీత సౌండ్ ఇంజనీర్ రసూల్ పూకుట్టి చేసిన కామెంట్లు కలకలం రేపిన సంగతి తెలిసిందే. మునీష్ భరద్వాజ్ అనే ఒక నార్త్ దర్శకుడు సినిమా ఏమీ బాగోలేదని తన జీవితంలో అరగంట వేస్ట్ అయిందని కామెంట్స్ చేయడంతో దానికి రసూల్ గే సినిమా అంటూ కామెంట్ చేయడం కలకలం రేపింది. ఈ విషయం మీద ఇప్పటికే బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ కౌంటర్ ఇవ్వగా తాజాగా కీరవాణి ఒక బూతు పదంతో ఇచ్చిన కౌంటర్ హాట్ టాపిక్ అయింది. అయితే ఆ ట్వీట్ ఆయన కాసేపటికి డిలీట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

గే సినిమా అంటూ

గే సినిమా అంటూ

స్లమ్డాగ్ మిలియనీర్ సినిమాకు సౌండ్ ఇంజనీర్ గా పనిచేసిన రసూల్ ఆ సినిమాకు గాను ఆస్కార్ అవార్డు అందుకున్నారు. అయితే గత కొద్ది రోజుల క్రితం ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మునిష్ భరద్వాజ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో సినిమా ఏమీ బాలేదని ఈ సినిమా చూడటం కోసం తన జీవితంలో అరగంట వృధా చేశారంటూ కామెంట్ చేశారు. దానికి రసూల్ కామెంట్ చేస్తూ ఇది ఒక గే సినిమా అంటూ పేర్కొన్నాడు.

కరెక్ట్ కాదని

కరెక్ట్ కాదని

ఈ విషయం వివాదంగా మారే అవకాశం ఉండటంతో మునీష్ భరద్వాజ దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక కథనాన్ని షేర్ చేసి మీరు మాట్లాడేది దీని గురించే కదా అని కామెంట్స్ చేయడంతో అవునని దాని గురించి మాట్లాడుతున్నానని రసూల్ కూడా చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారం మీద కామెంట్ చేసిన బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ఒక మంచి టెక్నీషియన్ ఇలా మరో సినిమా గురించి కామెంట్ చేయడం కరెక్ట్ కాదని అన్నారు.

కీరవాణి ఎంట్రీ

కీరవాణి ఎంట్రీ

అది గే సినిమా కాదు, కానీ ఒకవేళ నిజంగానే గే సినిమా అయినా తప్పేంటి అని ప్రశ్నించారు. అయితే దానికి సినిమాను కించపరచడం తన ఉద్దేశం కాదని, తాను తన ఉద్దేశం చెప్పలేదు కానీ ఇప్పటికే పబ్లిక్ డిమైన్ లో ఉన్న విషయాన్ని ప్రస్తావించానని రసూల్ క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఈ వివాదం అక్కడితో సద్దుమణుగుతుంది అనుకుంటున్న క్రమంలో సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరించిన కీరవాణి ఎంట్రీ ఇచ్చారు.

ట్వీట్ తొలగించారు కానీ

ట్వీట్ తొలగించారు కానీ

ఈ సినిమా గురించి రసూల్ చేసిన కామెంట్లు గురించి ప్రస్తావించుకుండానే రసూల్ పేరు మెన్షన్ చేస్తూ తనకు ఎక్కడ అప్పర్ కేసు పదాలు వాడాలి ఎక్కడ లోయర్ కేసు పదాలు వాడాలి అనే విషయం తెలియదంటూ ఒక పెద్ద బూతు పదంతో కలకలం రేపారు. ఈ విషయం మీద తెలుగు నెటిజన్లు భిన్నంగా స్పందించడంతో ఎందుకైనా మంచిదననే ఉద్దేశంతో కీరవాణి ఆ ట్వీట్ తొలగించారు.

క్యారెక్టర్ బ్లైండ్నెస్

క్యారెక్టర్ బ్లైండ్నెస్

కానీ తర్వాత ఆ వివాదాన్ని కొనసాగించే ప్రయత్నం చేశారు. తనకు ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ పాత్ర గానీ ఎన్టీఆర్ పాత్ర గానీ కనిపించలేదని వందల మంది యువకులను దేశభక్తులుగా తీర్చిదిద్దిన అజయ్ దేవగన్ మాత్రమే కనిపించిందని అన్నారు. అలా తనకు అప్పర్ కేసు లోయర్ కేసు జబ్బుపోయి క్యారెక్టర్ బ్లైండ్నెస్ వచ్చింది అంటూ కామెంట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X