ముసలి బామ్మగా కీరవాణి
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ముసలి బామ్మ పాత్రను క్రిష్ వేదం సినిమాలో పోషిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 'గమ్యం' ఫేమ్ రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వం వహిస్తున్న 'వేదం' చిత్రం షూటింగ్ హైదరాబాద్ లోని సినీమాక్స్ థియేటర్‌లో శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ ఈ చిత్రంలో ఆశ్చర్యకరమైన సంగతేమంటే నేను ముసలి బామ్మ పాత్ర చేస్తున్నా. అలాగే రెండు కత్తులు ఒక ఒరలో ఇమడవంటారు. కానీ అర్జున్, మనోజ్ వంటి రెండు చురకత్తుల్ని ఒకే ఒరలో ఇమడ్చడం ద్వారా ఆ నానుడి తప్పని క్రిష్ రుజువు చేస్తున్నారు. ఎలాంటి ఇగో సమస్యలు లేకుండా ఆ ఇద్దరూ ఈ సినిమా చేస్తుండటం చాలా హ్యాపీ. ఇక పాటలు విషయానికొస్తే నా స్టైల్‌తో పాటు క్రిష్ స్టైల్‌లో ఇందులోని పాటలుంటాయి అన్నారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ "ఈ సినిమాకి అసలు స్టార్ క్రిష్ తయారుచేసిన స్క్రిప్టు. ఇందులో ప్రధానమైన ఐదు పాత్రలూ సమానంగా ఉంటాయి. బాలీవుడ్‌లో మాదిరిగా తెలుగులో ఎందుకు మల్టీస్టారర్స్ రావడంలేదనే వాళ్లకు సమాధానం ఈ సినిమా. మనోజ్, అనుష్కలతో నా కాంబినేషన్ సెన్సేషనల్ అవుతుంది. ఇందులో ఐదు పాత్రలకీ ఐదు కథలుంటాయి. చివరకి ఒకచోట ఆ పాత్రలు కలుస్తాయి. ఈ సినిమా చేస్తున్నానని చిరంజీవి మావయ్యకు చెబితే సంతోషంగా 'ఆల్ ది బెస్ట్' చెప్పి, తానూ, మోహన్‌బాబు అంకుల్ కలిసి నటించిన సినిమాలను ప్రస్తావించారు" అని చెప్పారు.


Click it and Unblock the Notifications











