కీరవాణి సంచలన వ్యాఖ్యలు.. .జూ.ఎన్టీఆర్ పైనా?
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి యువ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఈగ' చిత్రం జులై 6న విడుదలవుతున్న సందర్భంగా ఆ చిత్రానికి సంగీతం అందించిన ఆయన ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.... ఈ జనరేషన్ హీరోలపై కామెంట్స్ చేశారు.
ఎన్టీఆర్, ఏఎన్ఆర్ హయాంలో హీరోలు పాటలకు ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగా పలికించే వారు... కానీ ఈ తరం హీరోలు పాటలకు తగిన విధంగా ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వలేక పోతున్నారు. వాళ్లు డాన్స్ పై పెట్టిన శ్రద్ధ హావ భావాలపై పెట్టడం లేదని... పాటకు కాళ్లు, చేతులు ఊపడం కంటే ముఖ్యం హావభాలు పలికించడమే అని చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితులకు కారణం కొరియోగ్రాఫర్లను నెత్తినెక్కించుకోవడమే. కొందరు దర్శకులు, హీరోలు వారికి టూమచ్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని కీరవాణి చెప్పుకొచ్చారు. ఇలాంటి ధోరణి సరికాదని, పాటలన్నీ డాన్స్ కోసమే అనే అభిప్రాయాన్ని నేను వ్యతిరేకిస్తానంటూ కీరవాణి స్పష్టం చేశారు.
కీరవాణి ఈ వాఖ్యలు చేసింది... పరోక్షంగా జూ ఎన్టీఆర్ నటించిన 'దమ్ము' చిత్రంలో రూలర్ పాటను ఉద్దేశించే అనే అంటున్నారంతా. కేవలం యువ హీరోలపై విమర్శలతో కీరవాణి ఆగలేదు... ఇటు ఆడియన్స్‌ను కూడా టార్గెట్ చేశారు. చాలా మంది ఆడియన్స్ కూడా అదే నౌకలో ప్రయానిస్తున్నారని విమర్శించారు.


Click it and Unblock the Notifications











