»   » ఆ ముగ్గురూ వెళ్లి పోతే... రాజమౌళికి పెద్ద దెబ్బే!

ఆ ముగ్గురూ వెళ్లి పోతే... రాజమౌళికి పెద్ద దెబ్బే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒక సినిమా అద్భుతంగా రావాలంటే సమర్థవంతమైన దర్శకుడు ఉండాలి. అయితే ఆ దర్శకుడు సమర్థవంతంగా తన పని పూర్తి చేయాలంటే మంచి నైపుణ్యం ఉన్న టెక్నీషియన్స్ సపోర్టు ఎంతో అవసరం.

దర్శకుడు రాజమౌళి 'బాహుబలి' లాంటి పెద్ద ప్రాజెక్టును సమర్థవంతంగా తెరకెక్కించారంటే....ఆయన ఒక్కడే సినిమా చేసాడని కాదు కదా, ఆయన వెనక ఎంతో మంది టెక్నీషియన్స్ సపోర్టు ఉంది కాబట్టే ఆయన అంత బాగా సినిమాను తీయగలిగారు.


బాహుబలి ప్రాజెక్టులో సినిమాలో బాగా హైలెట్ అయిన అంశాల్లో సినిమాటోగ్రఫీ, సంగీతం, యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు. రాజమౌళి తన కెరీర్ మొదలు పెట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్నింటికీ ఆయన అన్నయ్య కీరవాణి సంగీతం అందిస్తూ వస్తున్నారు.


కీరవాణి

కీరవాణి

సంగీత దర్శకుడు కీరవాణి త్వరలో రాజమౌళి సినిమాలకి దూరం కాబోతున్నారు. సుధీర్ఘ కాలంగా సినీసంగీత దర్శకుడిగా పని చేస్తున్న కీరవాణి రిటైర్మెంట్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. 2016 డిసెంబరు 8న తాను రిటైర్ అవుతానని కీరవాణి ఇప్పటికే ప్రకటించారు.


సెంథిల్ కుమార్

సెంథిల్ కుమార్

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ కూడా రాజమౌళి దరగ్గర ‘సై' సినిమా నుండి పని చేస్తున్నారు. బాహుబలి-2 తర్వాత సెంథిల్ కూడా రాజమౌళికి దూరం కాబోతున్నారు. దర్శకత్వం వైపు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారని టాక్.


పీటర్ హెయిన్స్

పీటర్ హెయిన్స్

రాజమౌళి తెరకెక్కించిన చత్రపతి, మగధీర, మర్యాద రామన్నా, బాహుబలి సినిమాతో పాటు ప్రస్తుతం తెరకెక్కుతున్న బాహుబలి-2కు కూడా పీటర్ హెయిన్స్ పని చేసాడు. ఇతగాడు కూడా దర్శకత్వం వైపు వెళ్లే అవకాశం ఉంది.


రాజమౌళికి దెబ్బే

రాజమౌళికి దెబ్బే

ఇంత కాలం తన టీంలో కీలకమైన వ్యక్తులుగా ఉన్న ఈ ముగ్గురు టెక్నీషియన్స్ తనను విడిచి వెళ్లి పోవడం రాజమౌళికి పెద్ద దెబ్బే అనే టాక్ వినిపిస్తోంది. వాళ్ల స్థానాలను భర్తీ చేసే సమర్థులైన టెక్నీషియన్స్ వస్తే తప్ప రాజమౌళి టీం మల్లీ పర్ఫెక్ట్ గా తయారు కాదు అని అంటున్నారంతా.


బాహుబలి-2

బాహుబలి-2

బాహుబలి-2 రిలీజ్ డేట్ ఆల్రెడీ ఖరారైంది. బాహుబలి రెండో పార్ట్ హిందీ వర్షెన్ 2017, ఏప్రిల్ 28న విడుదలవుతున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. రాజమౌళి దర్శకత్వంలో గతేడాది వచ్చిన పార్ట్ 1 'బాహుబలి-ది బిగినింగ్' చూసిన ప్రతి ఒక్కరూ.... పార్ట్ 2 'బాహుబలి-ది కంక్లూజన్' ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


అక్టోబర్ 23 నుంబడి

అక్టోబర్ 23 నుంబడి

ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా అక్టోబరు 23న బాహుబలి-2 చిత్రం ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. షూటింగ్‌ మరో రెండు నెలల్లో అంటే నవంబర్‌ నెలాఖరు నాటికి పూర్తికానుందని సమాచారం. 'బాహుబలి: ద బిగినింగ్‌'కు మించి 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌'లో యాక్షన్‌ సీన్లు ఉంటాయని చెప్తున్నారు.


English summary
After Baahubali 2 reaase Keeravani, KK Senthil Kumar out from Rajamouli team.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu