హరికృష్ణని ఆపేసిన ట్రాఫిక్ పోలీస్.. సీఎం కొడుకు అయినా కూడా, ఏం జరిగిందంటే!
నందమూరి హరికృష్ణ బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించారు. నేడు ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సినీరాజకీయ ప్రముఖులంతా హరికృష్ణ భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నారు. హరికృష్ణతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
సంగీత దర్శకుడు కీరవాణి ట్విట్టర్ ద్వారా హరికృష్ణ గురించి ఆసక్తికరమైన విషయాన్ని పేర్కొన్నారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగింది. హైదరాబాద్ లో హరికృష్ణ కారులో వెళుతున్నారు. ముషీరాబాద్ లో సిగ్నల్ జంప్ చేశాడనే కారణంతో ట్రాఫిక్ పోలీస్ ఆయన వాహనాన్ని ఆపేశారు.

తాను ఆపింది ముఖ్యమంత్రి తనయుడి వాహనం అని ఆ పోలీసుకు తెలియదు. హరికృష్ణకు ఆ పోలీస్ జరిమానా విధించాడు. తప్పు తనదే కావడంతో హరికృష్ణ జరిమానా కట్టే అక్కడి నుంచి వెళ్లారు. తాను ముఖ్యమంత్రి కుమారుడిని అనే విషయం ఆ తరువాత కూడా అతడికి చెప్పలేదు. భేషజాలు లేని మనిషి హరికృష్ణ అని కీరవాణి ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications