బాలీవుడ్ స్టార్ చిత్రానికి కీరవాణి సంగీతం
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా రూపొందనున్న 'స్పెషల్ చబ్బీస్' చిత్రానికి కీరవాణి సంగీతం అందించ బోతున్నారు. 'వెన్స్ డే' చిత్రానికి దర్శకత్వం వహించిన నీరజ్ పాండే ఈచిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. వియాకం 18 మోషన్ పిక్చర్స్ పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్షయ్ కుమార్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, అనుపమ్ ఖేర్, మనోజ్ బాజ్ పాయ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
ముంబైలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈచిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకడు నీరజ్ పాండే. ఎంఎం క్రీమ్ పేరుతో కీరవాణి బాలీవుడ్ చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు. గతంలో హిందీలో వచ్చిన జిస్మ్, పహెలి, క్రమినల్, సుర్ అండ్ లాహోర్ చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు. ఇటీవల అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన రౌడీ రాథోడ్ చిత్రంలోని పాపులర్ ట్యూన్ జింతా తా జితా కూడా కీరవాణి కంపోజ్ చేసిసన విక్రమార్కుడు చిత్రానిదే కావడం గమనార్హం.
ఇతర విషయాల్లోకి వెళితే...కీరవాని సంగీతం అందించిన 'ఈగ' చిత్రం ఈ రోజు విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈచిత్రానికి కీరవాణి సందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ ప్లస్సయింది. మెలోడీ గీతాలతో పాటు కమర్షియల్ సాంగులను కంపోజ్ చేయడంలో కీరవాణికి మంచి పేరుంది. ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా కీరవాణి కొనసాగుతున్నారు.


Click it and Unblock the Notifications











