బెస్ట్ ట్యూన్స్ రాజమౌళికిచ్చేసి-బద్రీనాథ్ కి సాలిడ్ ట్యూన్స్ ఇచ్చాడా..!?
అల్లు అర్జున్, తమన్నా జంటగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న చిత్రం 'బద్రినాథ్". అల్లు అర్జున్ కెరీర్‌లో భిన్నమైన సినిమా ఇది. చిన్నికృష్ణ అందించిన కథతో రూపొందుతున్న ఈ చిత్రానికి ఠాగూర్ మధు నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.
కాగా 'మగధీర చిత్ర విజయంలో కీరవాణి సంగీతం కూడా కీలక పాత్ర పోషించడంతో అల్లు అర్జున్ వినాయక్ తీస్తున్నబద్రీనాథ్ కి కూడా కీరవాణినే సంగీత దర్శకుడిగా ఏరికోరి పెట్టుకున్నారు. అయితే తన బెస్ట్ ట్యూన్స్ అన్నీ భద్రం చేసి రాజమౌళికి ఇచ్చి, మిగతావాళ్లకి నాసిరకం పాటలు స్వరపరుస్తున్న కీరవాణి బద్రీనాథ్ విషయంలోను అదే చేశాడు. ఏడవ తేదీన విడుదలవుతున్న ఈ సినిమా పాటలకి శాంపిల్స్ బయటకి వదిలారు. ఈ పాటల బిట్స్ విని కీరవాణి బద్రీనాథ్ కి ఎంత సాలిడ్ గా శఠగోప్యంగా పెట్టాడో అర్థం చేసుకోవచ్చు. రాజమౌళితో తప్ప వేరే వాళ్లతో హిట్టివ్వలేకపోతున్న కీరవాణి సంగతి గుర్తించి అయినా అతడిని తీసుకునే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించకపోతే ఫలితం ఇలానే ఉంటుంది.


Click it and Unblock the Notifications