విషయం ఉంటే బ్లూ ఫిలింకు కూడా...ఎమ్.ఎమ్.కీరవాణి
నీలి చిత్రంలో కూడా విషయం ఉంది అనిపిస్తే సంగీతం చేయడానికి ఒప్పుకొంటాను. భక్తి సినిమానే అయినా అందులో లోపాలుంటే అస్సలు ఒప్పుకోను. ఎలాంటి సినిమా అయినా చేస్తాను. దర్శకుడు ఎవరైనా నాకు కథ నచ్చి, స్క్రిప్టు పక్కాగా ఉంటేనే రంగంలోకి దిగుతాను. అవి రెండూ బాగుంటే మంచి పాటలకు అవకాశం ఉంటుంది. అలా తాను సంగీతం ఇవ్వటానికి ఒప్పుకునే చిత్రాలుకు భేధభావం లేదంటున్నారు ప్రముఖ సంగీతం దర్శకుడు కీరవాణి. అలాగే సినిమా పూర్తయ్యాక కనీసం 15 ప్రింట్లతోనైనా విడుదల చేసే దమ్ము నిర్మాతకు ఉందా లేదా అని ఆలోచిస్తాను. లేదంటే మన కష్టమంతా ల్యాబుల్లోనే మగ్గిపోతుంది అంటున్నారాయన. అలాగే రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'మర్యాద రామన్న'లో మంచి సంగీతం అందివ్వడానికి అవకాశం చిక్కిందంటున్నారు. ముఖ్యంగా 'తెలుగమ్మాయి..' అనే పాట అందరికీ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక రీసెంట్ గా కె.రాఘవేంద్రరావు దర్సకత్వంలో రిలీజైన ఝుమ్మందినాదం చిత్రానికి ఆయన సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











