ఎన్టీఆర్ స్టామినా గురించి కీరవాణి ట్వీట్
క్లైమాక్స్ మినహా నేను దమ్ము చిత్రం పూర్తిగా చూసాను. రేపటినుంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్టార్ట్ చేస్తాను. బోయపాటి ఎన్టీఆర్ స్టామినానని రీడిఫైన్ చేసారు అంటూ ప్రముఖ సంగీత దర్సకుడు కీరవాణి ట్వీట్ చేసారు. ఎన్టీఆర్ తాజా చిత్రం దమ్ముకు సంగీత దర్శకుడుగా పరిచేస్తున్న ఆయన ఈ విధంగా ట్వీట్ చేయటంతో ఆ సినిమపై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. ఇక మరో ప్రక్క ఈ చిత్రం ఆడియో మార్చి 29న విడుదల కానుంది. ఆ రోజు కోసం నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్నారు. వెన్యూని మాత్రం శిల్పకళా వేదికగానే ఉంచినట్లు తెలుస్తోంది. ఇక చిత్రాన్ని మాత్రం ఏప్రియల్ 27నే విడుదల చేయనున్నారు. ప్రస్తుతం దమ్ము చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే జరుగుతోంది. నందమూరి ఫ్యామిలీకి సింహా లాంటి భారీ విజయాన్ని అందించిన బోయపాటి శ్రీను 'దమ్ము' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
త్రిష, కార్తీక హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై అలెగ్జాండర్ వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం విజయంపై దర్శకుడు చాలా కాన్పిడెంట్ గా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ..''ఎన్టీఆర్ దమ్ముని కొత్త కోణంలో ఆవిష్కరిస్తున్నాం. మాస్ యాక్షన్ అంశాలతో పాటు వినోదం మేళవించాం. పోరాటాలు ఆకట్టుకొంటాయని అన్నారు. ఇక ఈ చిత్రం కాక ఎన్టీఆర్ త్వరలో శ్రీను వైట్ల చిత్రం చేయనున్నారు. అలాగే హరీష్ శంకర్ చిత్రం సైతం ఆయన కమిటైనట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











