»   » వివి వినాయిక్ సొంత ధియోటర్లో 'బద్రినాథ్‌' చిత్రం చూస్తాను

వివి వినాయిక్ సొంత ధియోటర్లో 'బద్రినాథ్‌' చిత్రం చూస్తాను

Posted By:
Subscribe to Filmibeat Telugu

'బద్రినాథ్‌' చిత్రానికి సంగీతం అందిస్తున్న ఎమ్.ఎమ్.కీరవాణి తాజాగా ట్విట్టర్ లో ఈ చిత్రం గురించి ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ లో అయిదు రోజులు ఇంకా బద్రీనాధ్ కి వర్కింగ్ డేస్ మిగిలి ఉన్నాయి. ఈ చిత్రాన్ని వైజాగ్ లో వినాయిక్ కొత్త ధియోటర్ లో చూస్తాను అన్నారు. వినాయిక్ వైజాగ్ లో రాజ్ కమల్ ధియోటర్ ని కొనుక్కున్నారు. దాన్ని మల్టిప్లెక్స్ గా మారుస్తాడని తెలుస్తోంది. అలాగే తేజ,రామానాయుడు కూడా అక్కడ రామా, జ్యోతి ధియోటర్స్ ని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మిస్తున్న 'బద్రినాథ్‌'వచ్చే నెల 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. యాక్షన్‌ నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది.పీటర్‌ హెయిన్స్‌ ఆధ్వర్యంలో తెరకెక్కించిన యాక్షన్‌ దృశ్యాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. సాంకేతికంగా ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దాం. కీరవాణి సంగీతం ప్రత్యేక ఆకర్షణ అన్నారు. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా చేస్తోంది. కూర్పు: గౌతంరాజు, కళ: ఆనంద్‌సాయి, ఛాయాగ్రహణం: రవివర్మన్‌.

English summary
MM Keeravani tweeted “5 more working days for Badrinath…going to watch the morning show at Vinayak's new theatre at Vizag !!!” at too morning show.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu