ఎన్టీఆర్ హీరోయిన్ ..ఈసారి జగపతి బాబు సరసన

By Srikanya

ఎన్టీఆర్ తో ఆది చిత్రంలో హీరోయిన్ గా చేసిన కీర్తి చావ్లా ఆ తర్వాత కనిపించలేదు. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత ఆమె జగపతిబాబు సరసన ఓ చిత్రంలో చేస్తోంది.సాధ్యం పేరుతో రెడీ అవనున్న ఈ చిత్రంలో మొదటి హీరోయిన్ గా ప్రియమణి చేస్తోంది. ఓ కొత్త దర్శకుడు ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నాడు. ఇక ప్రియమణి,జగపతిబాబు కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం ఇది. ఇంతకుముందు వీరిద్దరూ పెళ్ళయిన కొత్తలో చిత్రంలో చేసారు. ఆ తర్వాత మదన్ రూపొందిస్తున్న ప్రవరాఖ్యుడు చిత్రంలో చేసారు. మొన్నే ఆడియో రిలీజైంది. త్వరలో రిలీజుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సాధ్యం చిత్రంలో కీర్తీ చావ్లా ఓ గ్లామర్ పాత్రను పోషిస్తున్నట్లు నిర్మాతలు కుమార్ బ్రదర్శ్ చెప్తున్నారు. ఆది చిత్రం హిట్టయినా వినాయిక్, ఎన్టీఆర్ లకు పేరు వచ్చింది కానీ కీర్తి చావ్లాను పట్టించుకున్నవారు లేరు. అయితే ఈ సారన్నా ఈ చిత్రంతో అందరి దృష్టిలో పడి మరిన్ని ఆఫర్స్ సంపాదిస్తుందని ఆశిద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X