పవన్ కళ్యాణ్ మూవీలో హీరోయిన్‌గా కీర్తీ సురేష్
హైదరాబాద్: 'నేను శైలజ' మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ కీర్తి సురేష్ బంపర్ అవకాశం దక్కించుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది. 'అత్తారింటికి దారేది' లాంటి భారీ విజయం తర్వాత పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇటీవల మరో కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నారు. అందులో ఒక హీరోయిన్ గా కీర్తి సురేష్ ఎంపికైంది. ఈ విషయాన్ని కీర్తి సురేష్ ట్విట్టర్ ద్వారా ఖరారు చేసారు. మరో హీరోయిన్ గా పూజా హెడ్గే ఎంపికయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











