ఇప్పటికే మూడు నాలుగు పెళ్లిళ్లు.. అది మాత్రం పక్కా.. కీర్తి సురేష్ కామెంట్స్
కీర్తి సురేష్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నానా హల్చల్ చేసింది. అయితే సోషల్ మీడియాలో కీర్తి హవా బాగానే ఉంటోంది. కానీ వెండితెరపై మాత్రం అంతగా ప్రభావం చూపడం లేదు. మహానటి తరువాత మళ్లీ ఆ రేంజ్ హిట్ కీర్తి సురేష్ ఖాతాలో పడటం లేదు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా బోల్తా పడ్డాయి. మొన్నీ మధ్యే వచ్చిన రంగ్ దే కూడా ఆశించినంతగా ఆడలేదు. అలా ప్రస్తుతం కీర్తి సురేష్ కెరీర్ కాస్తా స్లోగానే సాగుతోంది.

సోషల్ మీడియాలో రచ్చ..
రంగ్ దే ప్రమోషన్స్‌లో భాగంగా కీర్తి సురేష్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. అను అర్జున్ అంటూ పాత్రలకు తగ్గట్టుగా సోషల్ మీడియాలో ఎప్పుడూ పోట్లాడుతూ వచ్చారు. రివేంజ్ అంటూ ఫన్నీ వీడియోలను షేర్ చేస్తూ వచ్చారు. అయితే ఇవే కాకుండా కీర్తి సురేష్ మీద రకరకాల రూమర్లు కూడా వస్తుంటాయి.

పెళ్లిపై రచ్చ..
కీర్తి సురేష్ పెళ్లి అంటూ ఎన్నో రకాల రూమర్లు బయటకు వచ్చాయి. కొన్ని సందర్భాల్లో అయితే ఇక ఏకంగా పెళ్లి ప్రకటన వచ్చేస్తోందంటూ కూడా రాసేశారు. అలా చాలా సందర్భాల్లో వార్తలు రాసేశారు. కానీ గత నెలలో ఆ వార్తల తాకిడి మరీ ఎక్కువైంది.

అనిరుధ్‌తో ప్రేమ..
సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌తో కీర్తి సురేష్ ప్రేమలో ఉందంటూ రూమర్లు మొదలయ్యాయి. ఇద్దరి బర్త్ డేల మధ్య ఒక్క రోజే గ్యాప్ ఉండటం, ఒకరినొకరు విష్ చేసుకుంటూ క్లోజ్‌గా ఉన్న ఫోటోలను షేర్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారేమో అనే టాక్ వచ్చింది. ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతోన్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి.

షాక్ అయ్యాను..
నా పెళ్లి గురించి చాలా సందర్భాల్లో నెట్టింట్లో పోస్టులు, ఫొటోలు దర్శనమిచ్చాయి. వాటిని చూసి షాకయ్యాను. కొంతమంది నెటిజన్లు సోషల్‌మీడియా వేదికగా ఇప్పటికే, మూడు, నాలుగుసార్లు నాకు పెళ్లి చేసేశారు. మొదట వాటిని చూసి షాక్ అయ్యాను. తర్వాత నవ్వుకున్నాను. కానీ, ఒక్కటి మాత్రం పక్కా చెప్పగలను.. నా పెళ్లికి ఇంకా చాలా సమయం ఉంది. సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా వివాహం చేసుకుంటానని కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











