వీడియో: నీకు సిగ్గులేదు.. తిట్లు కూడా ఎంత క్యూట్‌గా తిడుతోందో.. మహానటి డబ్బింగ్ ప్రోమో!
లెజెండరీ నటి సావిత్రి జీవిత చరిత్రని మహానటి చిత్రంగా తెరకెక్కించారు. నాగ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం విజయపథంలో దూసుకుపోతోంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ కు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. కీర్తి సురేష్ అద్భుతమైన హావభావాలతో నటించిన మెప్పించింది.
ఇక జెమిని గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్, మధురవాణిగా సమంత, ఫోటో గ్రాఫర్ గా విజయ్ దేవరకొండ నటించారు. తాజగా ఈ చిత్రం కోసం డబ్బింగ్ చెబుతున్న కీర్తి సురేష్ వీడియోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. కీర్తి సురేష్ మాటలు ఎంత క్యూట్ గా ఉంటాయో మరో మారు ఈ వీడియో ద్వారా తెలిసింది.

నీకు సిగ్గులేదు.. అనే డైలాగ్ ని చెప్పడానికి కీర్తి సురేష్ ప్రయత్నిస్తోంది. కీర్తి సురేష్ మరి కొన్ని డైలాగులని క్యూట్ గా చెబుతూ, డబ్బింగ్ ని ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. విడుదల తరువాత కూడా చిత్రయూనిట్ పెద్ద స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుండడం విశేషం.


Click it and Unblock the Notifications











