క్రేజీ బయోపిక్‌లో కీర్తీ సురేష్... రెండు చిత్రాలతో బాలీవుడ్ ఎంట్రీ.. హీరోలు ఎవరంటే!
తెలుగు వారి అభిమాన నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రంతో దక్షిణాది ప్రేక్షకులందరికీ కీర్తి సురేష్ చేరువయ్యారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఈ చిత్రంతో కీర్తి సురేష్ కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. మహానటి చిత్రానికి అనూహ్యమైన స్పందన రావడం, కీర్తీ సురేష్ నటనకు ప్రేక్షకులు నీరాజనం పట్టడంతో ఆమె అగ్రతార మారిపోయింది. ఇప్పుడు కీర్తి సురేష్ కెరీర్ మరో రేంజ్‌కు చేరుకోనేందుకు రంగం సిద్దమైంది. ఈ ఏడాది బాలీవుడ్‌లో రెండు చిత్రాలకు కీర్తీ సురేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

బయోపిక్‌తో బాలీవుడ్ ఎంట్రీ
బాలీవుడ్‌లో తెరకెక్కే బయోపిక్ చిత్రంలో అజయ్ దేవగన్ సరసన నటించడానికి కీర్తీ సురేష్ ఒకే చెప్పింది. ఇంకా పేరు పెట్టని చిత్రానికి అమిత్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. 2018లో ఘన విజయం సాధించిన బదాయి హో అనే చిత్రానికి ఈయన దర్శకుడు. క్రీడా నేపథ్యంతో రూపొందే చిత్రంలో కీర్తీ సురేష్ నటించడానికి ఒప్పుకొన్నట్టు బాలీవుడ్ పత్రికల సమాచారం. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నది.

నాగేష్ కుకునూరు చిత్రానికి గ్రీన్ సిగ్నల్
మహానటి చిత్రంలో కీర్తి సురేష్ నటన చూసిన ప్రముఖ దర్శకుడు నాగేష్ కుకునూర్ ఫిదా అయ్యాడట. గతంలో జాతీయ అవార్డులను సొంతం చేసుకొన్న దర్శకుడు నాగేష్ రూపొందించే సినిమాలో కీర్తీ సురేష్‌ను తీసుకొన్నాడట. ఆయన చెప్పిన కథ విన్న వెంటనే బాలీవుడ్ చిత్రంలో నటించడానికి కీర్తీ సురేష్ అంగీకరించిందని బాలీవుడ్ వర్గాల సమాచారం.

తెలుగు, హిందీ, తమిళ భాషల్లో
కీర్తీ సురేష్, నాగేష్ కుకునూరు కాంబినేషన్‌లో తెరకెక్కే చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించనున్నది. ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రూపొందనున్నది. ఈ సినిమాకు సహ నిర్మాతగా ఉండేందుకు టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ రిలయనస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది.

రజనీకాంత్, మోహన్‌లాల్‌తో
ఇలా బాలీవుడ్‌లో అడుగుపెట్టడానికి ప్లాన్ చేసుకొంటున్న కీర్తీ సురేష్ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ రూపొందించే మరక్కర్: అరంబికదలింటె సింహం అనే మలయాళ చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రంలో మోహన్ లాల్ ప్రముఖ పాత్రలో కనిపిస్తారు. అలాగే రజనీకాంత్‌తో ఏఆర్ మురుగదాస్ రూపొందించే చిత్రంలో కూడా నటిస్తున్నది.

శ్రీదేవి, జయప్రద అడుగుజాడల్లో
ఇలా దక్షిణాదిలో వరుస చిత్రాలను, అగ్రహీరోలతో నటిస్తూనే బాలీవుడ్ రంగంపై కీర్తీ సురేష్ దృష్టిపెట్టింది. గతంలో శ్రీదేవి, జయప్రద, దివ్యభారతి లాంటి హీరోయిన్ల అడుగు జాడల్లో కీర్తీ సురేష్ నడిచేందుకు సిద్ధమవుతున్నది. బాలీవుడ్‌లో కీర్తీ సురేస్ జెండా ఎగురవేస్తుందా అనే విషయం కొద్దిరోజుల్లోనే తెలియడం ఖాయం.


Click it and Unblock the Notifications











