జయలలిత బయోపిక్.. కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చిందిగా!
సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అద్భుతంగా నటించింది అని వస్తున్న ప్రశంసల్ని పూర్తి ఆస్వాదించకముందే మరో ప్రచారం మొదలైపోయింది. మహానటి చిత్రం విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రానికి కాసుల వర్షం కురుస్తోంది. ఇదిలా ఉండగానే జయలలిత బయోపిక్ కు రంగం సిద్ధం అవుతోందంటూ ప్రచారం మొదలైపోయింది.
అక్కడితో ఆగకుండా కీర్తి సురేషే జయలలిత పాత్రలో నటించబోతోందంటూ ఊహాగానాలు మొదలు పెట్టారు. ఈ వార్తలపై కీర్తి సురేష్ స్పందించింది. మహానటి చిత్రం తరువాత తాను మరే చిత్రానికి సంతకం చేయలేదని తెలిపింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితాన్ని వెండి తెరపై ఆవిష్కరిస్తే బావుంటుందనే ఆలోచన చాలా మందిలో ఉంది.

జయలలిత ఓ ఇంటర్వ్యూలో తన బియోపిక్ చిత్రం గురించి మాట్లాడారు. తన పాత్రలో నటించడానికి ఐశ్వర్యారాయ్ సరిపోతుందని అమ్మ అప్పట్లో భిప్రాయపడింది. సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి చిత్రం ఘనవిజయం సాధించడంతో మరిన్ని బయోపిక్ తెరపైకి వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications