twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Good Luck Sakhi Twitter Review: కీర్తి సురేష్ సినిమాకు షాకింగ్ టాక్.. ప్లస్ మైనస్ ఇవే.. ఎలా ఉందంటే!

    |

    కొంత కాలంగా తెలుగు సినీ లవర్స్ టేస్ట్‌లో చాలా తేడా కనిపిస్తోంది. అందుకే ఈ మధ్య ప్రయోగాత్మకంగా తీస్తున్న చిత్రాలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ ఇస్తున్నారు. దీంతో ఇన్నేళ్లూ ఓ మూస ధోరణిలో సాగుతూ వచ్చిన టాలీవుడ్ సినిమాలు.. ఇప్పుడు సరికొత్త పంథాలో వస్తున్నాయి. ఇందులో భాగంగానే రీమేక్‌లు, సీక్వెల్స్‌, మల్టీస్టారర్ మూవీలు ఇలా ఎన్నో రకాల జోనర్లలో సినిమాలు రూపొందుతోన్నాయి.

    అదే సమయంలో క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలు కూడా బాగానే తెరకెక్కుతున్నాయి. ఇలా ఇప్పటికే పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాగా.. వాటిలో చాలా వరకూ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక, ఇప్పుడు అలా వచ్చిన చిత్రమే 'గుడ్ లక్ సఖి'. ఈ సినిమా ట్విట్టర్ రివ్యూపై ఓ లుక్కేద్దాం పదండి!

    కీర్తి సురేష్ లీడ్‌గా గుడ్ లక్ సఖి

    కీర్తి సురేష్ లీడ్‌గా గుడ్ లక్ సఖి

    మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో షూటింగ్ నేపథ్యంలో వచ్చిన చిత్రమే 'గుడ్ లక్ సఖి'. నగేష్ కుకునూర్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇందులో ఆది పినిశెట్టి హీరోగా, జగపతి బాబు కీలక పాత్రలో నటించారు. దీన్ని దిల్‌ రాజు సమర్పణలో సుధీర్‌ చంద్ర పదిరి.. శ్రావ్య వర్మతో కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

    శ్యామ్ సింగ రాయ్ ప్రపంచ రికార్డు: వరల్డ్ మొత్తంలో మూడో స్థానం.. ఇండియాలోనే నెంబర్ వన్శ్యామ్ సింగ రాయ్ ప్రపంచ రికార్డు: వరల్డ్ మొత్తంలో మూడో స్థానం.. ఇండియాలోనే నెంబర్ వన్

    అంచనాలు పెంచిన అప్‌డేట్స్

    అంచనాలు పెంచిన అప్‌డేట్స్

    స్పోర్ట్స్ బేస్‌డ్ డ్రామాగా వచ్చిన 'గుడ్ లక్ సఖి' మూవీపై ఆరంభంలో అంచనాలు పెద్దగా లేవు. కానీ, ఈ చిత్రం నుంచి ఏది విడుదలైన భారీ రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు రికార్డు వ్యూస్ వచ్చాయి. అలాగే, పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో కీర్తి సురేష్ నటించిన ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి.

    బిజినెస్ కూడా భారీగా.. గ్రాండ్‌గా

    బిజినెస్ కూడా భారీగా.. గ్రాండ్‌గా

    కీర్తి సురేష్‌కు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా మార్కెట్ లేదు. అయినప్పటికీ 'గుడ్ లక్ సఖి' మూవీపై అంచనాలు ఉండడంతో హక్కులకు పోటీ ఏర్పడింది. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మంచి బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. అన్ని ఏరియాల్లో కలిపి ఈ మూవీని 540కు పైగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.

    సమంత, నాగ చైతన్య విడాకుల కథలో బిగ్ ట్విస్ట్: ఆ పార్టీ తర్వాతే విభేదాలు.. ముందు అడిగింది తనేనట!సమంత, నాగ చైతన్య విడాకుల కథలో బిగ్ ట్విస్ట్: ఆ పార్టీ తర్వాతే విభేదాలు.. ముందు అడిగింది తనేనట!

    గుడ్ లక్ సఖికి ఊహించని టాక్

    గుడ్ లక్ సఖికి ఊహించని టాక్

    కీర్తి సురేష్ - ఆది పినిశెట్టి జంటగా వచ్చిన 'గుడ్ లక్ సఖి' మూవీ స్పోర్ట్స్ బేస్‌డ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు కూడా ప్రదర్శితం అయ్యాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. చాలా మంది ఈ చిత్రం ఏవరేజ్‌గా ఉందని ట్విట్టర్ వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

    ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ అలాగ

    ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ అలాగ

    'గుడ్ లక్ సఖి' మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే ఫస్టాఫ్ మొత్తం కమర్షియల్ పంథాకు దూరంగా పూర్తిగా స్పోర్ట్స్ నేపథ్యంతో సాగిపోతుందట. మరీ ముఖ్యంగా పేలవమైన స్క్రీన్‌ప్లే, స్టోరీతో సోసోగా నడుస్తుందట. ఇక, సెకెండాఫ్ కూడా ఫ్లాట్‌గానే ఉంటుందని అంటున్నారు. ఎమోషనల్ సన్నివేశాలు కూడా తేలిపోయాయట. అలాగే, డబ్బింగ్ చాలా దారుణంగా ఉందని తెలిసింది.

    ప్యాంటు విప్పేసి షాకిచ్చిన ప్రగ్యా జైస్వాల్: పైన కూడా ఓ రేంజ్‌లో.. వామ్మో ఇది మరీ ఘోరం!ప్యాంటు విప్పేసి షాకిచ్చిన ప్రగ్యా జైస్వాల్: పైన కూడా ఓ రేంజ్‌లో.. వామ్మో ఇది మరీ ఘోరం!

     సినిమా ప్లస్‌.. మైనస్‌లు ఎంటి?

    సినిమా ప్లస్‌.. మైనస్‌లు ఎంటి?

    'గుడ్ లక్ సఖి' మూవీని చూసిన వాళ్లంతా ఇచ్చిన రిపోర్టుల ప్రకారం.. ఇందులో కీర్తి సురేష్ నటన మాత్రమే బాగుందని అంటున్నారు. దర్శకుడు ఎంచుకున్న కథ బాగున్నా.. దాన్ని మలిచిన విధానం మాత్రం పేలవంగా ఉందట. అలాగే, ఎమోషనల్ సన్నివేశాలు, ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోవడం నిరాశనే మిగుల్చుతుందట. స్క్రీన్‌ప్లే కూడా ఏమాత్రం బాలేదని చెబుతున్నారు.

    మొత్తంగా సినిమా ఎలా ఉంది?

    మొత్తంగా సినిమా ఎలా ఉంది?

    ట్వీట్ల ద్వారా అందిన సమాచారం ప్రకారం.. కీర్తి సురేష్ నటించిన 'గుడ్ లక్ సఖి' మూవీ పూర్తిగా షూటింగ్ నేపథ్యంతో సాగే ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా అని తెలుస్తోంది. కమర్షియల్ అంశాలకు దూరంగా, వాస్తవికతకు దగ్గరగా ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశారట. అయితే, కొన్ని సన్నివేశాలు తేలిపోవడంతో ఫీల్ మిస్ అయిందని.. కీర్తి కోసం సినిమా చూడొచ్చని అంటున్నారు.

    English summary
    Tollywood Star Heroine Keerthy Suresh Now Did Good Luck Sakhi Under Nagesh Kukunoor Direction. Lets See This Movie Twitter Review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X