తన్మయత్వానికి గురైన కీర్తి.. ‘సఖి’గా మెప్పించేందుకు రెడీ!!

మహానటి కీర్తి సురేష్ ప్రస్తుతం ఫుల్ జోరు మీదుంది. లాక్ డౌన్ కీర్తి సురేష్ పేరు వినిపించినంతగా మరో స్టార్ హీరోయిన్ పేరు వినిపించలేదు. పెంగ్విన్ చిత్రంలో ఓటీటీలో హల్చల్ చేసింది. ఆ చిత్రంలో కీర్తి సురేష్ నటనతో అందర్నీ ఆశ్చర్యపరిచింది. అత్యధిక మంది వీక్షించిన చిత్రంగా పెంగ్విన్ ఆ సమయంలో రికార్డులు క్రియేట్ చేసింది. అత్యధిక వ్యూయర్ షిస్ సొంతం చేసుకుందని అమెజాన్ ప్రైమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక వరుస చిత్రాలతో కీర్తి సురేష్ దుమ్ములేపుతోంది. నితిన్ పెళ్లి రోజును ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్‌లోనూ కీర్తి సురేష్ హైలెట్ అయింది. రంగ్ దే టీజర్‌లో కీర్తి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇక మరోసారి కీర్తి తన సత్తాను చాటబోతోంది. తాజాగా రిలీజ్ చేసిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కీర్తి సురేష్ తన్మయత్వానికి గురవుతూ ఆనందంలో మునిగిపోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక అప్ డేట్‌ను ప్రకటించాడు.

Keerthy Suresh Good Luck Sakhi Teaser On 15th August

తమిళ, తెలుగు, మలయాళి భాషల్లో రిలీజ్ చేయబోతోన్న గుడ్ లక్ సఖి చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. అందులో ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఆగస్ట్ 15న ఉదయం పది గంటలకు టీజర్ రిలీజ్ చేయబోతోన్నట్టు తెలిపారు. నాగేశ్ కుకునూర్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ సినిమాలో కీర్తితో పాటు ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X