twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాకు అలాంటి భర్త కావాలి.. ఇద్దరు స్టార్ హీరోల పేర్లు చెప్పిన కీర్తి సురేష్!

    |

    క్రేజీ హీరోయిన్ కీర్తి సురేష్ తన కలల రాకుమారుడు ఎలా ఉండాలో వెల్లడించింది. పెళ్లిపై పెదవి విప్పింది. సినీ సెలెబ్రిటీలు అయినా తమకు కాబోయే భర్త కోసం హీరోయిన్లు సాధారణ యువతిలాగే ఆలోచిస్తారు. తమకు కాబోయే భర్త ఎలా ఉండాలో ఊహించుకుంటారు. కీర్తి సురేష్ ప్రస్తుతం సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. నేను శైలజ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ కొన్ని మంచి విజయాల్ని సొంతం చేసుకుంది. ఈ ఏడాది కెరీర్ లో గుర్తుండి పోయే విజయాలు కీర్తి సురేష్ దక్కించుకుంది. ఇంతకీ కీర్తి సురేష్ తన పెళ్లి గురించి ఎలాంటి విశేషాలు తెలియజేసిందో ఇప్పుడు చూద్దాం!

    అద్భుత విజయాలు

    అద్భుత విజయాలు

    సావిత్రి జీవిత ఘాఢగా విడుదలైన మహా నటి చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ పూర్తిగా సావిత్రి పాత్రలో ఒదిగిపోయి నటించింది. ఇక విజయ్ సరసన నటించిన సర్కార్ చిత్రం కీర్తి సురేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ గా నిలిచింది. సర్కార్ చిత్రం తర్వాత కీర్తి సురేష్ కొంత గ్యాప్ తీసుకుంది. తాను ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నానని కీర్తి సురేష్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

    Poll: ఉత్తమ తెలుగు నటి 2018Poll: ఉత్తమ తెలుగు నటి 2018

    ఆర్ఆర్ఆర్‌లో ఛాన్స్

    ఆర్ఆర్ఆర్‌లో ఛాన్స్

    రాజమౌళి, రాంచరణ్, ఎన్టీఆర్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో కీర్తి సురేష్ అవకాశం దక్కించుకుందని, ఆ చిత్రం కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. తమిళ, తెలుగు భాషల్లో అద్భుత అవకాశాలు దక్కించుకుంటున్నకీర్తి సురేష్ కొత్త సంవత్సరంలో ఇంకెన్ని సక్సెస్ లు అందుకుంటుందో చూడాలి.

    Poll: ఉత్తమ తెలుగు సహాయ నటుడు 2018Poll: ఉత్తమ తెలుగు సహాయ నటుడు 2018

    పెళ్లి ఆలోచన

    పెళ్లి ఆలోచన

    ఇటీవల కీర్తి సురేష్ ఓ కార్యక్రమంలో పాల్గొనగా మీడియా నుంచి పెళ్ళికి సంబందించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. తనకు అప్పుడే వివాహం చేసుకునే ఆలోచన లేదని కీర్తి సురేష్ తెలిపింది. పేమ వివాహమా లేక పెద్దలు కుదిర్చిన వివాహమా అనేది కూడా ఇప్పుడే చెప్పలేను. కానీ ప్రేమిస్తే మాత్రం ధైర్యంగా ఇంట్లో చెప్పేస్తా. మా కుటుంబ సభ్యులు ప్రేమ వివాహానికి అడ్డు చెప్పరు అని కీర్తి సురేష్ అభిప్రాయ పడింది.

    Poll: ఉత్తమ కొత్త తెలుగు నటి 2018Poll: ఉత్తమ కొత్త తెలుగు నటి 2018

    ఎలాంటి భర్త కావాలంటే

    ఎలాంటి భర్త కావాలంటే

    తనకు ఎలాంటి భర్త కావాలో మాత్రం కీర్తి సురేష్ ఫుల్ క్లారిటీతో ఉన్నట్లు ఉంది. హీరో విజయ్, విక్రమ్ లాంటి లక్షణాలు ఉన్న అబ్బాయి అయితే తనకు ఒకే అని కీర్తి సురేష్ తెలిపింది. విజయ్ తో సర్కార్ చిత్రంలో, విక్రమ్ తో సామి 2 చిత్రంలో కీర్తి సురేష్ నటించిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలు ఈ ఏడాదే విడుదలయ్యాయి.

    English summary
    Keerthy Suresh interesting comments on her marriage.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X