ఈ జన్మకు కుదరదన్న ఎన్టీఆర్.. మహానటిలో బిగ్‌ సర్‌ప్రైజ్!

Recommended Video

Keerthy Suresh Reveals About NTR's Character In Mahanati

మహానటి చిత్రం మే 9 బుధవారం భారీ విడుదలకు రంగం సిద్ధం అయింది. చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు విన్నూత్నంగా చేస్తూ ఆసక్తి పెంచుతున్నారు. కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో ఒదిగిపోయిన నటించిందనే విషయం టీజర్, వీడియో ప్రోమో ద్వారా అర్థం అవుతోంది. దర్శకుడు నాగ అశ్విన్ ఈ చిత్రాన్ని ఓ యజ్ఞంలాగా పూర్తి చేసాడు. సావిత్రి జీవితం గురించి అనేక అపోహలు అభిమానుల్లో ఉన్నాయి. వాటన్నింటిని దర్శకుడు ఎలా చూపించాడు అనే ఆసక్తి అభిమానుల్లో ఉంది. ఈ చిత్రంలో ప్రముఖుల పాత్రలో నటించిన వారిని ఒక్కొక్కరిగా పరిచయం చేస్తూ ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్వీ రంగారావు పాత్రలో మోహన్ బాబు నటించిన సంగతి తెలిసిందే. ఎన్నార్ పాత్రలో నాగ చైతన్య నటించాడు. ఇక ఎన్టీఆర్ పాత్ర గురించి సస్పెన్స్ అలాగే కొనసాగుతోంది. తాజగా ఓ ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ ఆసక్తికరమైన విషయం వెల్లడించింది.

 ఈ జన్మకు కుదరదు

ఈ జన్మకు కుదరదు

మహానటి ఆడియో వేడుకకు ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ చిత్రంలో తాతగారి పాత్ర కోసం తనని సంప్రదించిన విషయాన్ని ఎన్టీఆర్ ప్రస్తావించాడు. ఆయన పాత్రలో నటించే స్థాయి తనకు లేనందున అది ఈ జన్మకు కుదరదని ఎన్టీఆర్ తేల్చి చెప్పేశాడు.

ఎన్టీఆర్ లేకుండా

ఎన్టీఆర్ లేకుండా

సావిత్రి జీవితం 75 శాతం సినిమాలతోనే గడిచింది. ఆమె సినీ జీవితాన్ని ఎన్టీఆర్, ఎన్నార్ లేకుండా తెలుగు వారు ఊహించుకోలేరు. ఎన్నార్ పాత్రలో నాగచైతన్య నటిస్తున్నాడు. మరి ఎన్టీఆర్ పాత్ర ఎవరు అనే ప్రశ్న అభిమానుల్లో ఉంది.

 అలాగే అనుకున్నాం

అలాగే అనుకున్నాం

ఇటీవల కీర్తి సురేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా ఆమెకు ఎన్టీఆర్ పాత్ర గురించి ప్రశ్న ఎదురైంది. ఎన్టీఆర్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించి ఉంటే బావుండేది అని యాంకర్ అనగా.. తాము కూడా అలాగే అనుకున్నాం కానీ అది జరగలేదు అని కీర్తి సురేష్ తెలిపింది.

 సస్పెన్స్‌లోకి నెట్టిన కీర్తి సురేష్

సస్పెన్స్‌లోకి నెట్టిన కీర్తి సురేష్

జూనియర్ ఎన్టీఆర్ తన తాతగారి పాత్రలో నటించలేదు. ఎన్టీఆర్ గా ఎవరిని చూపించబోతున్నారు అనేప్రశ్నకు కీర్తి సురేష్ ఆసక్తికర సమాధానం ఇచ్చింది. మీరే సినిమాలో చూస్తారు అంటూ సస్పెన్స్ లోకి నెట్టింది.

డిజిటల్ టెక్నాలజీతో

డిజిటల్ టెక్నాలజీతో

యమదొంగ చిత్రంలో గ్రాఫిక్స్ సాయంతో ఎన్టీఆర్ ని చూపించారు. అదేవిధంగా సావిత్రి చిత్రంలో డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించి ఎన్టీఆర్ పాత్రని చూపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ ని ఎలా చూపించారు, ఏ సంధర్భంలో చూపించారు అనే విషయాలు మాత్రం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

 అద్భుత కళాఖండాలు

అద్భుత కళాఖండాలు


ఎన్టీఆర్, సావిత్రి కాంబినేషన్లో తెలుగు వారు అప్పటికి మరచిపోలేని అద్భుత కళాఖండాలు వంటి చిత్రాలు వచ్చాయి. వారిలో మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మ కథ, పాతాళభైరవి వంటి చిత్ర రాజాలు ప్రముఖమైనవి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X