twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అచ్చం సావిత్రిని చూసినట్లే ఉంది: ‘మహానటి’ కీర్తీ సురేష్ న్యూ పిక్

    By Bojja Kumar
    |

    ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా 'మహానటి' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తీ సురేష్ టైటిల్ రోల్ చేస్తోంది. తాజాగా ఆమె తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన ఓ ఫోటో సినీ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మాయా బజార్ చిత్రంలో సావిత్రి స్టిల్‌ను పోలినట్లు ఉన్న ఈ పిక్‌‌లో కీర్తిని చూస్తుంటే అచ్చం సావిత్రిని చూసినట్లే ఉంది అంటున్నారు అభిమానులు.

    మహానటి చిత్రాన్ని మే 9న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సావిత్రి పాత్రను కీర్తి సురేష్ పోషిస్తోంది. సావిత్రి జీవితం మీద రీసెర్చ్ చేసే జర్నలిస్టు పాత్రలో సమంత నటించింది. ఆమెతో పాటు ఉండే ఫోటోగ్రాఫర్ పాత్రను విజయ్ దేవరకొండ పోషించారు.

    Keerthy Suresh Mahanati new look as a Savithri

    దుల్కర్ సల్మాన్, శాలిని పాండే, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, మాళవికా నాయర్, భానుప్రియ, దివ్యవాణి, శ్రీనివాస్ అవసరాల, దర్శకులు క్రిష్, తరుణ్ భాస్కర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న "మహానటి" చిత్రాన్ని దర్శకుడు నాగ అశ్విన్ ఈ చిత్రాన్ని టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ తో తెరకెక్కిస్తున్నాడు. ఎస్వీ రంగారావుగా మోహన్ బాబు స్క్రీన్ ప్రెజన్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

    ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, ప్రొడక్షన్ డిజైన్: శివం, ఆర్ట్: అవినాష్, కాస్ట్యూమ్స్: గౌరాంగ్, అర్చన, స్టైలిస్ట్: ఇంద్రాక్షి, కెమెరా: డాని, కళా నేతృత్వం: తోట తరణి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు, దర్శకత్వం: నాగ అశ్విన్, నిర్మాత: ప్రియాంక దత్.

    English summary
    Keerthy Suresh 'Mahanati' new look as a Savithri. The movie Starring KeerthySuresh, Vijay Devarakonda, Dulquer Salmaan , Samantha Akkineni and Others. Music Composed By Mickey J Meyer, Directed by Nag Ashwin and Produced by Aswani Dutt, Priyanka Dutt and Swapna Dutt. Under the banner of Vyjayanthi Movies.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X