Don't Miss!
- Sports SRH vs MI: ఆ దిగ్గజ క్రికెటర్ వల్లనే చరిత్ర సృష్టించా- అభిషేక్ శర్మ
- News విజయవాడ పశ్చిమ సీటులో మారిపోయిన లెక్కలు !
- Automobiles ఫ్రీ బస్సులో వాటికి ప్రత్యేకంగా సీటు.. బామ్మ, మనవరాలికి షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
- Lifestyle Car Vastu Tips: కారు ఉందా అయితే ఈ వాస్తు నియమాలు పాటించండి..ఈ డైరెక్షన్ లో పార్క్ చేస్తే
- Technology Poco నుంచి F సిరీస్ లో కొత్త ఫోన్! స్పెసిఫికేషన్లు లీక్, వివరాలు
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
- Finance Hyderabad: తల్లి కోరిక తీర్చిన ఆనంద్ మహీంద్రా.. 4000 మంది విద్యార్థుల కోసం హైదరాబాదులో..
నో కాంప్రమైజ్.. మిస్ ఇండియా కోసం కీర్తి సురేష్ ప్రయత్నాలు చూస్తే!
మహానటి సినిమాతో తన ఫాలోయింగ్ అమాంతం పెంచుకుంది కీర్తి సురేష్. ఇందులో ఆమె చూపిన అభినయానికి ఫిదా అయిన దర్శకనిర్మాతలు కీర్తి డేట్స్ కోసం క్యూ కట్టారు. మహానటిలో కీర్తి నటనకు గాను జాతీయ స్థాయి గుర్తింపు రావడంతో టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా దేశ వ్యాప్తంగా ఈ అమ్మడి క్రేజ్ బాగా పెరిగింది.
తన అప్‌కమింగ్ సినిమాల కథలు ఎంపిక చేసుకోవడంలో ఎంతో జాగ్రత్త వహిస్తోంది కీర్తి సురేష్. ఈ మేరకు ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఓకే చెబుతోంది కీర్తి. ఈ నేపథ్యంలోనే కొత్త దర్శకుడు నరేంద్రనాథ్ తో ఆమె చేస్తున్న సినిమా 'మిస్ ఇండియా'. ఈ సినిమా కోసం కీర్తి సురేష్ బరువు బాగా తగ్గడమే గాక తన లుక్ కూడా మార్చుకోవడం విశేషం.
కథ ప్రకారం ఈ సినిమాలో డిఫరెంట్ టైమ్ పిరియడ్స్ ఉండటం కారణంగా, డిఫరెంట్ లుక్స్ అవసరం అయ్యాయట. దీంతో ఆ కాలానికి తగ్గట్లు ఆయా లుక్స్ కోసం బాగా కష్టపడిందట కీర్తి. సినిమాలో మొత్తం నాలుగు లుక్స్‌లో కనిపించనుందట కీర్తి. అయితే ఈ లుక్స్ కోసమై దాదాపు 50 లుక్స్ టెస్ట్స్ లో పాల్గొందట కీర్తి. నటిగా వచ్చిన పేరుని నిలబెట్టుకోవడానికై కీర్తి ఎక్కడా కాంప్రమైజ్ కాలేదట. ఆమె కష్టానికి ఫలితంగా మంచి అవుట్‌పుట్ కూడా వచ్చిందట. ఈ విషయాలను తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో 'మిస్ ఇండియా' డైరెక్టర్ నరేంద్ర నాథ్ స్వయంగా వెల్లడించాడు.
ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మాణంలో తెరకెక్కుతోంది 'మిస్ ఇండియా' మూవీ. ఈ సినిమాలో కీర్తి సురేష్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. నవీన్ చంద్ర, జగపతిబాబు, నరేష్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.